RRR Documentary : రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్ : బిహైండ్ అండ్ బియాండ్’ పేరుతో డాక్యుమెంటరీ

రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రలతో తెరకెక్కిన ఈ కల్పిత కథ దేశంలోనే కాదు....

RRR : భారతీయ సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌(RRR)’ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆస్కార్‌తోపాటు పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. తారక్‌, రామ్‌ c కథానాయకులుగా డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ చిత్రం 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు ఈ టీమ్‌ ప్రేక్షకులకు ఒక సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమాపై డాక్యుమెంటరీ సిద్థం చేసినట్లు తెలిపింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ పేరుతో ఈ డాక్యుమెంటరీ రానున్నట్లు ప్రకటించింది. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) కీర్తిని ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు దీని కథకు ప్రపంచం సాక్ష్యంగా నిలవనుంది’ అంటూ ఈ ప్రాజెక్ట్‌ గురించి వెల్లడించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తెరవెనక ఏం జరిగింది.. దీన్ని ఎలా రూపొందించారో ఇందులో చూపనున్నారు. ఈ డాక్యుమెంటరీ ఈ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. దీనిని థియేటర్‌లలో విడుద? చేస్తారా? ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

RRR Documentary Update

రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రలతో తెరకెక్కిన ఈ కల్పిత కథ దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రపంచ సినిమా తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది. ఈ చిత్రం థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ హవా చూపింది. అలాగే దీన్ని పలు భాషల్లో అనువాదం చేయగా అక్కడ కూడా రికార్డు సృష్టించింది. జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టి 300 మిలియన్‌ జపాన్‌ యెన్‌ల( రూ.18 కోట్లు) క్లబ్‌లో చేరింది. ఈ క్లబ్‌లో చేరిన తొలి భారతీయ సినిమా ఇది. ప్రస్తుతం రాజమౌళి మహేశ్‌తో తీయనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కావొస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే స్ర్కిప్ట్‌ పనులు పూర్తికాగా…లొకేషన్ల ఎంపికపై కసరత్తులు మొదలుపెట్టారు. గ్లోబ్‌ ట్రాకింగ్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతోంది. జనవరిలో చిత్రీకరణ మొదలుపెడతారని తెలుస్తోంది.

Also Read : Samantha : నెట్టింట తెగ వైరల్ అవుతున్న ‘సమంత’ పోస్ట్

CinemaRRRTrendingUpdatesViral
Comments (0)
Add Comment