Champion Movie : రోషన్ హీరోగా నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ తో సినిమా

రోషన్‌ని కొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు ప్రదీప్ అద్వైతం యూనిక్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు...

Champion : రోషన్ హీరోగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ‘ఛాంపియన్’ చిత్రం తెరకెక్కనుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ లో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్‌ల బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇదే వేదికపై ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు . ‘ కల్కి 2898 AD’ ఎపిక్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన విజనరీ నాగ్ అశ్విన్ ఫస్ట్ షాట్‌కు క్లాప్‌ ఇచ్చారు.

Champion Movie Updates

రోషన్‌ని కొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు ప్రదీప్ అద్వైతం యూనిక్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. సినిమాలో డైనమిక్ రోల్ పోషిస్తున్న రోషన్ సినిమా కోసం కంప్లీట్ మేకోవర్‌ అయ్యారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చరిస్మాటిక్ గా కనిపించారు. ఈ ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.

Also Read : Hero Prabhas : ప్రభాస్ హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..

CinemaHero RoshanTrendingUpdatesViral
Comments (0)
Add Comment