Saree: ఆర్జీవీ ‘శారీ’నుండి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ !

ఆర్జీవీ ‘శారీ’నుండి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ !

Saree: కాంట్రవర్సీ టాపిక్స్‌ తో పాటు నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే వివాదాస్పద దర్శకుడిగా రాంగోపాల్ వర్మకు ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘శారీ(Saree)’. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు గిరికృష్ణ కమల్‌ దర్శకుడు. ఆర్జీవీఆర్వీప్రొడక్షన్స్‌ పతాకంపై రవి వర్మ నిర్మించిన ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో నవంబరులో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి ‘ప్రేమా… ప్రేమా.. ప్రేమా… నీ కోసం నా నిరీక్షణ.. నీ కోసం నా అన్వేషణ’ అంటూ మొదలై, ‘ఐ వాంట్‌ లవ్‌… ఐ వాంట్‌ లవ్‌…’ అంటూ సాగే రొమాంటిక్‌ సాంగ్‌ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ తో రూపొందించిన సంగీతాన్ని ఉపయోగించారు.

Saree Movie Updates

ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ… ‘‘మా భాగస్వామి రవివర్మతో కలిసి ‘ఆర్జీవీ డెన్‌ మ్యూజిక్‌’ను ఆరంభిస్తున్నానని చెప్పడానికి థ్రిల్‌ అవుతున్నాను. ఇందులో ఏఐ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృతిమ మేధ) యాప్స్‌తో రూపొందిన సంగీతం మాత్రమే ఉంటుంది. ‘శారీ’ మొత్తం ఏఐ సంగీతంతోనే సాగుతుంది. నేపథ్య సంగీతానికి కూడా ఏఐ మ్యూజిక్‌నే వాడాం. వందేళ్ల భారతీయ చలన చిత్ర చరిత్రలో ఏఐ మ్యూజిక్‌తో వస్తున్న పూర్తి స్థాయి, మొదటి చలన చిత్రంగా ‘శారీ’ నిలుస్తుందని గర్వంగా చెప్పగలశ్రీశ్రీం’’ అని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్‌ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలో యూనిట్‌ పేర్కొంది.

Also Read : Simbu: పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ కోసం శింబు పాట ! కన్ఫర్మ్ చేసిన చిత్ర యూనిట్ !

Ram Gopal VarmaSaree
Comments (0)
Add Comment