Ketika Sharma : టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై భగ్గుమంటున్నారు సినీ ప్రేమికులు. తాజాగా తను చేసిన పాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. నితిన్ రెడ్డి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన రాబిన్ హుడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ కు రెస్పాన్స్ లభిస్తోంది. సినిమాకు సంబంధించి స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు. ఇందులో ప్రత్యేకంగా కనిపించింది ..మురిపించేలా చేసింది కేతిక శర్మ(Ketika Sharma).
Ketika Sharma Song Controversy
ఈ సాంగ్ లో హుక్ స్టెప్ వైరల్ గా మారింది. కుడుమల వెంకీ దర్శకత్వం వహిస్తున్నాడు రాబిన్ హుడ్ కు. దీనికి మ్యూజిక్ ఇచ్చాడు తమిళ సినీ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్. ఈ సాంగ్ ను చంద్రబోస్ రాశాడు. స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇదే సమయంలో బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ బిగ్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించాడు. ఊర్వశి రౌతేలా తో చేసిన పాట వివాదాస్పదంగా మారింది. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నిర్మాత నాగవంశీ. ఇందులో ఎలాంటి ఇబ్బంది అంటూ ఏమీ లేదన్నాడు. తాజాగా రాబిన్ హుడ్ స్పెషల్ పాటపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నాడు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్.
Also Read : Beauty Avneet Kaur :యంగ్ క్రికెటర్ తో నటి డేటింగ్..?