Ritu Varma: ప్రియదర్శి, నభానటేశ్‌ కు రీతూవర్మ స్ట్రాంగ్ వార్నింగ్ !

ప్రియదర్శి, నభానటేశ్‌ కు రీతూవర్మ స్ట్రాంగ్ వార్నింగ్ !

Ritu Varma: ‘డార్లింగ్‌’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్‌ మధ్య బుధవారం సోషల్‌ మీడియాలో జరిగిన సంభాషణ వైరల్‌ గా మారిన విషయం తెలిసిందే. పరిచయం లేని మహిళను డార్లింగ్ అని పిలవడం నేరమని, కామెంట్‌ చేసేముందు మాటలు జాగ్రత్త అంటూ నభా నటేశ్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడీ గొడవలోకి నటి రీతూవర్మను భాగం చేశారు. ‘నా కామెంట్స్‌ సెక్షన్‌లో మీ పంచాయతీ ఏంటి ?’ అని ఆమె ప్రశ్నించారు. ఇంతకీ, ఆ నటీనటుల సంభాషణలోకి రీతూవర్మ ఎలా భాగమయ్యారంటే..

Ritu Varma Warning

నటి రీతూవర్మ(Ritu Varma) కొన్ని రోజుల క్రితం ఓ ఫొటోషూట్‌ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన చిత్రాలను ఇన్‌ స్టాలో షేర్‌ చేశారు. వాటిపై తాజాగా ప్రియదర్శి స్పందించారు. ‘‘వావ్‌ రీతూ డార్లింగ్‌… ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు’’ అని కామెంట్‌ చేశారు. దీనిపై నభా నటేశ్‌ స్పందిస్తూ… ‘‘ఇతను మళ్లీ మొదలుపెట్టాడు. ఆడవాళ్ల కామెంట్‌ సెక్షన్‌ పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. అందరినీ డార్లింగ్‌ అని పిలవడం ఏంటి ? నీ బ్రెయిన్‌ పనిచేయడం లేదా ?’’ అని అసహనం వ్యక్తం చేయగా… ‘‘నేను ఎవరినైనా డార్లింగ్‌ అని పిలిస్తే నీకెందుకు ఇబ్బంది?’’ అని అతడు బదులిచ్చారు. ఈ మొత్తం సంభాషణపై రీతూవర్మ స్పందిస్తూ.. ‘‘నా కామెంట్‌ సెక్షన్‌లో మీ పంచాయితీ ఏంటి?’’ అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదేదో సినిమా ప్రమోషన్‌ లా ఉందని వారు భావిస్తున్నారు.

Also Read : Dune Part 2: రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘డ్యూన్ పార్ట్- 2’ !

Nabha NateshPriyadarshi PulikondaRitu Varma
Comments (0)
Add Comment