Ritu Varma Success :మ‌జాకా మూవీ స‌క్సెస్ ప‌క్కా

న‌టి రీతూ వ‌ర్మ కామెంట్స్

Ritu Varma : త్రినాథ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌జాకా మూవీ విడుద‌లకు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. చాలా ఏళ్ల గ్యాప్ త‌ర్వాత అన్షు ఇందులో కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించింది. ఈ సంద‌ర్బంగా డైరెక్ట‌ర్ స‌భ్య స‌మాజం ముఖ్యంగా మ‌హిళా లోకం సిగ్గు ప‌డేలా వ్యాఖ్యానించారు. తెలుగు ప్రేక్ష‌కులు హీరోయిన్లు , ఇత‌ర అతిథి పాత్ర‌ల‌లో న‌టించే వారి యెద లావుగా ఉండాల‌ని కోరుకుంటార‌ని , అందుకే అన్షు కాస్తా సైజులు పెంచితే బావుంటుందంటూ నోరు పారేసుకున్నాడు.

Ritu Varma Comment

దీంతో ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియాలో ట్రోల్ కు గుర‌య్యాడు. త‌ను మాస్ మ‌హ‌రాజాతో ధ‌మాకా తీశాడు. ఇది సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. దీంతో మ‌నోడు చేసిన కామెంట్స్ కు పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త రావ‌డంతో గ‌త్యంత‌రం లేక మ‌హిళా లోకానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఇక మ‌జాకాలో రీతూ వ‌ర్మ‌(Ritu Varma)తో పాటు అన్షు కూడా న‌టిస్తోంది. సందీప్ కిష‌న్ హీరో. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌ల చేసేందుకు నిర్ణ‌యించారు మూవీ మేక‌ర్స్.

తాజాగా మ‌జాకా హీరోయిన్ రీతూ వ‌ర్మ సినిమా గురించి చిట్ చాట్ చేసింది. త‌న కెరీర్ లో పూర్తి ఎంట‌ర్ టైన్మెంట్ సినిమాలో న‌టించ లేద‌ని ,ఈ మూవీతో ఆ కోరిక తీరి పోతుంద‌న్నారు. త‌న కెరీర్ విష‌యంలో తాను చాలా సంతృప్తిక‌రంగానే ఉన్నాన‌ని చెప్పింది. త‌ను వ‌రుడు కావ‌లెను మూవీలో న‌టించింది. ఈచిత్రం త‌న‌కు మంచి పేరు తీసుకు వ‌చ్చేలా చేసింది.

Also Read : Milky Beauty Tamannaah :మ‌హా కుంభ మేళా సాక్షిగా ఓదెల‌2 టీజ‌ర్ 

CinemaCommentsMazakaRitu VarmaTrendingUpdates
Comments (0)
Add Comment