Rithika Singh: రజనీకాంత్ షూటింగ్ గాయపడ్డ హీరోయిన్

రజనీకాంత్ షూటింగ్ గాయపడ్డ హీరోయిన్

Rithika Singh: ‘జై భీమ్’ సినిమా ఫేం టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్న సినిమా ‘తలైవా 170’ (వర్కింగ్‌ టైటిల్‌). మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో భారతదేశంలోనే అగ్ర కథానాయకులు అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. కార్మికుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2024 ఏప్రిల్‌లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Rithika Singh – షూటింగ్ లో గాయపడ్డ హీరోయిన్ రితికా సింగ్

రజనీకాంత్ సరసన నటిస్తున్న ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన రితికా సింగ్(Rithika Singh)… ఇటీవల షూటింగ్ చేస్తుండగా లో గాయపడింది. ఇదే విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన వీడియోలో నటి రితికా సింగ్ మాట్లాడుతూ…

“అప్పటికే జాగ్రత్తగా ఉండమని సెట్‌లో అందరూ చెబుతూనే ఉన్నారు. కానీ గాజు అద్దాన్ని నేను సరిగ్గా పట్టుకోలేకపోయాను. నేను పట్టు కోల్పోవడం వల్లే ఇలా జరిగింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. కొన్నిసార్లు రెప్పపాటులో జరిగే వాటిని మనం ఆపలేం. ఈ గాయం వల్ల నేను షూటింగ్‌ నుంచి విరామం తీసుకుంటున్నా. ప్రస్తుతానికి నొప్పి లేదు. అయినా కొన్ని గాజు ముక్కలు లోతుగా దిగాయి. అందుకే ఆసుపత్రికి వెళ్లాను” అని ఆ వీడియోలో వెల్లడించింది. అంతేకాదు ఈ గాయం వల్ల షూటింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నానని… గాయం నుంచి కోలుకున్న తర్వాతే తిరిగి సెట్స్‌లో పాల్గొంటానని పేర్కొంది.

వెంకటేష్ ‘గురు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రితికా సింగ్

‘ఇరుది చుట్రు’ అనే సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ అయిన నటి రితికా సింగ్. ఇది అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఈ సినిమాను హిందీలో ‘సాలా ఖాదూస్‌’ గా డబ్‌ చేయగా… తెలుగులో విక్టరీ వెంకటేశ్ హీరోగా ‘గురు’ గా రీమేక్‌ చేసారు. రియల్ గా బాక్సర్ అయిన రితికా సింగ్… ఈ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తరువాత పలు సౌత్‌ సినిమాల్లో నటించిన పెద్ద క్రేజ్‌ సంపాదించుకోలేకపోయింది. దీనితో ఇటీవల దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ మూవీలో ఐటం సాంగ్‌లో ఆడిపాడిన ఈ బ్యూటీ… ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 170వ మూవీలో నటిస్తోంది.

Also Read : Anasuya Bharadwaj: కేటీఆర్‌ కు నటి అనసూయ ఓదార్పు

Rajani KanthRithika Singh
Comments (0)
Add Comment