Rishab Shetty: పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటున్న కాంతారా హీరో రిషబ్‌ శెట్టి

పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటున్న కాంతారా హీరో రిషబ్‌ శెట్టి

Rishab Shetty: ‘కాంతార’ సినిమాతో యావత్తు సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు నటుడు, దర్శకుడు రిషబ్‌ శెట్టి. ‘కాంతార’ ఘనవిజయం తర్వాత ఆయన ఒక్కసారిగా పాన్ ఇండియా యాక్టర్ కమ్ డైరెక్టర్ గా మారిపోయారు. ‘కాంతార’ బ్లాక్ బస్టర్ కావడంతో దానికి ప్రీక్వెల్ గా ‘కాంతార ఏ లెజెండ్‌: ఛాప్టర్‌ 1’ ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల గోవా వేదికగా జరిగిన 54వ ‘ఇఫి’ వేడుకలో ‘కాంతార’కు సిల్వర్‌ పీకాక్‌ అవార్డు దక్కింది. ఈ పురస్కారం దక్కించుకున్న తొలి కన్నడ చిత్రం ఇదేనని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది.

Rishab Shetty Viral

కాంతారా సినిమా విజయంతో నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఒక పౌండేషన్‌ను ఏర్పాడు చేశాడు. దక్షిణ కర్ణాటకలోని కెరటి గ్రామానికి చెందిన రిషబ్(Rishab Shetty)… తన శెట్టి ఫౌండేషన్ ద్వారా సహాయ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చారు. ఇందులో భాగంగ తన సొంత గ్రామం కెరటికు తనకు చేతనైన సాయం చేయాలని ముందుకు వచ్చాడు. భవిష్యత్ లో ఈ ఫౌండేషన్ ద్వారా కనీస అవసరాలే లేని కన్నడ పాఠశాలలను ఎలా అభివృద్ధి చేయాలి వంటి ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నాడట. ఇందులో మరికొందరిని భాగస్వామ్యం చేసేందుకు కూడా ఆయన చూస్తున్నారట. ఇందులో భాగంగా తాను ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన పాఠశాలను తాజాగా రిషబ్‌ సందర్శించారు. పాఠశాలను దత్తత తీసుకోవడంపై ఆయన ప్రాథమిక చర్చ జరిపారు. అంతేకాకుండా ప్రస్తుత విద్యార్థులు, ఉపాధ్యాయులతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారని సమాచారం. త్వరలో ఆయన ఈ విషయంపై క్లారటీ ఇస్తారని తెలుస్తోంది.

Also Read : Hero Raviteja Eagle: ఆకట్టుకుంటున్న రవితేజ ఈగల్.. ట్రైలర్‌!

Kantara Chapter 1Rishab Shetty
Comments (0)
Add Comment