Rishab Shetty: అభిమానితో రష్మికకు క్లారిటీ ఇప్పించిన రిషబ్ శెట్టి

అభిమానితో రష్మికకు క్లారిటీ ఇప్పించిన రిషబ్ శెట్టి

Rishab Shetty: స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు రిషబ్ శెట్టి. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాయ్ ఫ్రెండ్ గా రిషబ్ శెట్టి పేరు అప్పట్లో బాగా వినిపించేది. అయితే ఆమె తెలుగులో గీతగోవిందం సినిమా చేసిన నాటి నుండి విజయ్ దేవరకొండతో సన్నిహితంగా ఉంటూ వస్తోంది. దీనితో రష్మిక… రిషబ్ బ్రేకప్ చెప్పి విజయ్ తో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుంది అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Rishab Shetty – ఇతరుల వలే కన్నడ ఇండస్ట్రీను వదిలి వెళ్ళేది లేదన్న రిషబ్

అయితే ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) వేడుకలో పాల్గొన్న రిషబ్ శెట్టి… ఓటీటీ సంస్థలు మరియు కన్నడ ఇండస్ట్రీను వదులుతున్న నటులు గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. “ఒక్క హిట్‌ తన ఖాతాలో పడగానే ఇతరుల్లా తాను కన్నడ చిత్ర పరిశ్రమను వదిలిపెట్టాలనుకోవడం లేదని నటుడు రిషబ్‌ శెట్టి(Rishab Shetty) స్పష్టం చేసారు. ‘కాంతార’ సినిమా క్రెడిట్‌ అంతా కన్నడ ప్రేక్షకులదేనని… ముందుగా వారు ఆదరించి విజయాన్ని అందిస్తే ఆ తర్వాత ఇతర భాషల్లో ఆ సినిమా డబ్‌ అయి విజయం సాధించిందన్నారు.

‘‘కాంతార’ తర్వాత నాకు ఇతర చిత్ర పరిశ్రమల నుంచి అవకాశాలు వచ్చాయి. కానీ, నేను వాటిని తిరస్కరించా. కన్నడ ప్రేక్షకులకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడిని,” అంటూ వ్యాఖ్యానించారు. రిషబ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… అతను పరోక్షంగా తన మాజీ గర్ల్ ఫ్రెండ్ రష్మికను ఉద్దేశ్యించి మాట్లాడినట్లు కొంతమంది అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

అభిమాని పెట్టిన పోస్టుపై స్పందించిన రిషబ్

అయితే ఈ అంశంపై ఓ అభిమాని వివరణ ఇస్తూ…. రిషబ్‌(Rishab Shetty) చెప్పింది ఎవరినీ ఉద్దేశించి కాదని.. ఆయన పరిశ్రమను వదిలి వెళ్లనని చెప్పారంటూ ఆ స్పీచ్‌ను పోస్ట్ చేశారు. దీనిపై వెంటనే రిషబ్‌ స్పందిస్తూ.. ‘నేను చెప్పింది ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. రష్మికను ఉద్దేశ్యించి తాను వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇవ్వడం కోసమే అభిమాని పెట్టిన పోస్టుకు రిషబ్ స్పందించారు అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

కన్నడలో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్, బాలీవుడ్ కి పరిమితం అవుతున్న నేషనల్ క్రష్

కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లోకల్ బ్యూటీ రష్మిక మందన్నా… తోలి సినిమాతోనే సైమా,ఐఫా లో ఉత్తమ నటి పురష్కారాలు అందుకుంది. ఆ తరువాత మరో రెండు సినిమాల్లో నటించిన తరువాత… ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. గీతగోవిందం, డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, సీతారామం, వారసుడు, పుష్ప, యానిమల్ వంటి వరుస హిట్ సినిమాలతో నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందింది. అయితే ఈమెను ఉద్దేశ్యించి రిషబ్ గోవాలో వ్యాఖ్యలు చేసినట్లు అభిమానులు కామెంట్లు పెట్టడంతో వివాదం నెలకొంది.

Also Read : Dil Raju: పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరో… నిర్మాత దిల్‌ రాజు ఇంట వేడుక

Rashmika MandannaRishab Shetty
Comments (0)
Add Comment