Hero Rishab Shetty : మ‌రాఠా యోధుడిగా రిష‌బ్ శెట్టి

ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గా

Rishab Shetty : భార‌త దేశ చ‌రిత్ర‌లో ఎంద‌రో యోధులు. మ‌రెంద‌రో బ్రిటీష్ దాస్య సృంఖ‌లాల నుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు పోరాటం చేశారు. ఈ మ‌ట్టిలో క‌లిసి పోయారు. ఇక మ‌రాఠా గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మొఘ‌లుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించిన యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్. ఇటీవ‌ల సినిమా రంగానికి సంబంధించి కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి.

Rishab Shetty As a King

చ‌రిత్ర‌కు సంబంధించిన క‌థ‌ల‌కు ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ద‌క్కుతోంది. తాజాగా శివాజీ మహారాజ్ త‌న‌యుడు శంభాజీ మ‌హారాజ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించిన ఛావా చ‌రిత్ర సృష్టిస్తోంది. విడుద‌లైన తొలి షో నుంచే దుమ్ము రేపుతోంది. ఇందులో శంభాజీగా విక్కీ కౌశ‌ల్ న‌టించ‌గా భార్య ఏసుబాయిగా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా న‌టించింది.

ఇక కాంతారా మూవీతో రికార్డుల మోత మోగించి ఒక్క‌సారిగా దేశం త‌న వైపు చూసేలా చేసుకున్న న‌టుడు రిష‌బ్ శెట్టి(Rishab Shetty). మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాను ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గా న‌టించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు. శివాజీ జీవితం ఆధారంగా రానుంది. ఈ సినిమా గురించి డైరెక్ట‌ర్ సందీప్ సింగ్ కీల‌క అప్ డేట్ ఇచ్చాడు. ది ప్రైడ్ ఆఫ్ భార‌త్ – ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ అని పేరు కూడా పెట్టారు.

ఇవాళ ఇందులో న‌టించే టీమ్ ను ప్ర‌క‌టించారు. ఈ ఏడాది మే నెల‌లో జ‌ర‌గ‌నున్న కేన్స్ ఫెస్టివ‌ల్ లో రిష‌బ్ శెట్టి ఫ‌స్ట్ లుక్ ను ఆవిష్క‌రిస్తామ‌ని తెలిపారు.

Also Read : Rashmi Gautham Love :ర‌ష్మీ గౌతం రాజ‌మౌళి ల‌వ్ వైర‌ల్

CinemaRishab ShettyTrendingUpdates
Comments (0)
Add Comment