Richa Chadha: లేటు వయసులో పెళ్ళి… వెంటనే తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ !

లేటు వయసులో పెళ్ళి... వెంటనే తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ !

Richa Chadha: బాలీవుడ్ లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు రిచా చద్దా. ఓయ్ లక్కీ.. లక్కీ ఓయ్ అనే సినిమాతో బాలీవుడ్ లోనికి ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ… గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సిరీస్ తో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్-1 సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ (క్రిటిక్స్), గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్-2, సర్ప్జిత్, బ్యాంక్ సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది. ఆ తరువాత పలు వెబ్ సిరీస్ లో నటిస్తోంది. గతేడాది ఫర్కీ-3 సినిమాతో అభిమానులను అలరించిన రిచా చద్దా… ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ “హీరామండి”లో కీలక పాత్ర పోషిస్తోంది. త్వరలోనే ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది.

Richa Chadha Viral

అయితే ఫర్కీ నటుడు అలీ ఫైజల్‌ తో ప్రేమాయణం కొనసాగించిన రిచా చద్దా(Richa Chadha)… 37 ఏళ్ళ వయసులో 2022లో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. అయితే లేటుగా పెళ్ళి చేసుకున్నప్పటికీ లేటెస్ట్ గా ఆమె తల్లికాబోతున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీనితో రిచా చద్దా పోస్ట్ చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు.

2013లో ఫర్కీ సినిమా సెట్స్‌ లో మొదటిసారి కలుసుకున్న రిచా, అలీ ఫైజల్ ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లపాటు డేటింగ్‌ లో ఉన్న వీరు ఆ తరువాత పంజాబీ, లక్నో సంప్రదాయంలో ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. పెళ్లి తర్వాత సినీ ప్రముఖుల కోసం ముంబైలో గ్రాండ్ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. అయితే పెళ్ళై రెండేళ్ళు తిరగకముందే తల్లిదండ్రులు కాబోతున్న ఈ జంటకు సినీప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Mamta Mohandas: కొత్త స్పోర్ట్స్‌ కారు కొన్న మమతా మోహన్‌ దాస్‌ !

Gangs of WasseypurRicha Chadha
Comments (0)
Add Comment