Richa Chadha: సినిమా షూటింగ్ లో మద్యం తాగిన బాలీవుడ్ బ్యూటీ !

సినిమా షూటింగ్ లో మద్యం తాగిన బాలీవుడ్ బ్యూటీ !

Richa Chadha: దేవదాస్, పద్మావతి, గంగూభాయ్ కతివాడి, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా వంటి ఎన్నో వాస్తవిక కథలను కళ్ళకు కట్టినట్లు చూపించిన భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. అయితే మొదటి సారిగా ఈ దర్శకుడు తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ తో ఓటీటీలోనూ సత్తా చాటారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్తాన్ లోని లాహోర్ లో ఉన్న వేశ్యల జీవితాల ఆధారంగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్‌ హైదరీ, రిచా చద్దా(Richa Chadha), షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’… ద్వారా బాలీవుడ్‌ అందాల తారలందరిని ఒకే ఫ్రేమ్‌ లో మహారాణుల మాదిరిగా చూపించిన ఈ వెబ్ సిరీస్ సినీప్రియుల ప్రశంసలు పొందుతోంది.

Richa Chadha Viral

అయితే ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ షూటింగ్‌ అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు రిచా చద్దా. ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో రిచా చద్ధా మాట్లాడుతూ… ‘సంజయ్‌లీలా భన్సాలీ ప్రతీ సన్నివేశాన్ని శ్రద్ధగా తీస్తారు. ఇందులో ఒక సన్నివేశంలో నేను మద్యం తాగి డ్యాన్స్‌ వేయాలి. ఒక రోజంతా షూటింగ్ చేసినా… కనీసం పావువంతు కూడా అవలేదు. దానికోసం 40 టేక్‌లు తీశారు. అనుకున్నట్లు రావడం లేదన్నారు. మరుసటిరోజు నిజంగానే మద్యం తాగాను. ఆ తర్వాత డ్యాన్స్‌ అనుకున్నట్లుగా వచ్చింది.

మనకు ఇచ్చిన పాత్రకు 100 శాతం న్యాయం చేయాలనుకునే స్వభావం నాది. మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. మనం ఎలా ఉంటాం. మన డ్రెస్సింగ్ ఎలాఉందని ఎవరూ గమనించరు. మన నటనను మాత్రమే చూస్తారు. ఇందులో నాది మంచి పాత్ర. అందుకే సెట్‌ లో అందరి సూచనలు తీసుకున్నాను. నాకెంతో నచ్చింది’ అని చెప్పారు. ప్రస్తుతం రిచా చద్ధా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. డెడికేటెడ్ హీరోయిన్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read : Double iSmart: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ పై కీలక అప్‌ డేట్‌ ఇవ్వడానికి సిద్ధమౌతోన్న సినిమా యూనిట్ !

HeeramandiRicha ChadhaSanjay Leela Bansali
Comments (0)
Add Comment