Akhri Somvar : ప్రేమికుల రోజు ప్రత్యేకించి ప్రేమికులకు సరికొత్త ప్రేమ కథతో వచ్చింది అఖ్రీ సోమవార్(Akhri Somvar). నటి రిచా చద్దా ఇందులో నటించింది. హీరా మండి ద్వారా పేరు పొందింది తను. ఇది సినిమా కాదు కానీ ఓ అద్భుతమైన ప్రేమతో ముడి పడి ఉన్న నాటకం. దీనిని తనే స్వంతంగా రాసింది. అందులో నటించింది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా తను మెదడుకు పని పెట్టింది. క్రియేటివిటీకి ప్రాణం పోసింది. రాయడం, చదవడం, నటించడం పనిగా పెట్టుకుంది.
Akhri Somvar Movie Updates
అఖ్రీ సోమవార్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన బాల్యం అంతా మధ్య తరగతి కుటుంబం పంజాబీలో గడిచింది. మనుషులు, బంధాలు, అనుభవాలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు..ఆలోచనలు అన్నీ ఒకే కథలో చెప్పేందుకు ప్రయత్నం చేశానని పేర్కొంది.
ఈ సమయంలో ప్రతి ఒక్కరు కలలు కంటారు. ఎన్నో అద్భుతమైన ఆశయాలతో ఉంటారు. ఉద్యోగంలోకి ప్రవేశించినప్పుడు అవి మారి పోతాయి. 30 ఏళ్ల మధ్యలో కెరీర్, భర్త, ఫ్యామిలీ రెండింటిని కలిగి ఉండాలని కోరుకుంటారు. ప్రత్యేకించి పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటారు. చాలా మటుకు ఎక్కువగా ఆశించినవన్నీ నెరవేరుతాయన్న నమ్మకం ఉండదు.
ఇక తాను ఈ నేపథ్యాన్ని ప్రాతిపదికగా చేసుకుని అఖ్రీ సోమవార్ కథను రాశానని చెప్పింది రిచా చద్దా. ఇందులో ప్రేమ, సామాజిక ఒత్తిళ్లను ప్రతిఫలించేలా చేశానని పేర్కొంది. ఇదిలా ఉండగా తను నెట్ ఫ్లిక్స్ వెబ్ సీరీస్ హీరా మండి ది డైమండ్ బజార్ లో లజ్జో పాత్రలో నటించింది. దీనికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు.
Also Read : తనతో బంధం బ్రహ్మానందం భావోద్వేగం