Rhea Singha : ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా సింఘా సొంతం చేసుకున్నారు. జైపుర్‌లోని జీ స్టూడియోలో జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’ పోటీల్లో గుజరాత్‌కు చెందిన రియా విజయం సాధించారు. గుజరాత్‌కు చెందిన రియా సింఘా(Rhea Singha) 18 ఏళ్ల వయసులోనే ఈ అందాల పోటీల్లో గెలిచి అందరినీ ఆకర్షించారు. 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఆమె ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న ఊర్వశీ రౌతేలా ఈ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా గెలుచుకోవడంపై ఊర్వశీ సంతోషం వ్యక్తం చేశారు. టైటిల్‌ను ప్రకటించిన సందర్భంలో రియా భావోద్వేగానికి లోనయ్యారు ఆమె మాట్లాడుతూ ుూమిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విన్నర్ కావడం ఆనందంగా ఉంది. ఈ టైటిల్ గెలుచుకున్న క్షణాలు జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోతాయి. ఈ పోటీలో పాల్గొనడం కోసం ఎంతో కష్ట పడ్డాను. ఇక్కడి వరకూ రావడం వెనుక చాలా కృషి ఉంది. గతంలో ఈ పోటీల్లో గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాను’’ అని అన్నారు.
Rhea Singha As a Miss Universe..
ఊర్వశీ మీడియాతో మాట్లాడుతూ.. ‘గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024లో భారత్‌కు రియా ప్రాతినిధ్యం వహించనుంది. రియా ఆ పోటీల్లోనూ విజేతగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. ఈ పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలంతా ఎంతో కష్టపడ్డారు. వారి డెడికేషన్ ఆశ్చర్యపరిచింది’ అన్నారు.
Also Read : Mahesh Babu : తెలంగాణ వరద బాధితుల సహాయ చెక్ ను సీఎం కు అందజేసిన మహేష్