Rhea Chakraborty : బాలీవుడ్ నటి రియా చక్రవర్తి మరోసారి వార్తల్లో నిలిచింది. జిరోదా సహ వ్యవస్థ్థాపకుడు నిఖిల్ కామత్‌తో ముంబయి వీధుల్లో బైక్‌పై చక్కర్లు కొడుతూ కనిపించారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందన్న రూమర్లు వినిపిస్తూ వచ్చాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య సమయంలో రియా చక్రవర్తి పేరు మీడియాలో ప్రముఖంగా వినిపించింది. అప్పట్లో అనేక న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెను అరెస్ట్ చేసింది. తర్వాత బెయిల్‌పై బయటికొచ్చి కెరీర్‌పై దృష్టి సారించారు. మే నెలలో ‘చాప్టర్2’ పేరుతో ఓ క్లాత్స్ బ్రాండ్‌ను ప్రారంభించారు.
Rhea Chakraborty With..
జిరోదా సహ వ్యవస్థ్థాపకుడైన నిఖిల్ కామత్‌కు ఇప్పటికే పెళ్లయ్యింది. 2021లో వివాహ బంధానికి వీడ్కోలు పలికారు. ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌తో కొంతకాలం ప్రేమాయణం నడిపారు. దానికి కూడా మూడేళ్ల క్రితమే బ్రేక్ పడింది. ఆయనతో రియాతో పలు సందర్భాల్లో నిఖిల్‌తో పలు పార్టీల్లో కెమెరాలకు చిక్కారు. దాంతో రూమర్లకు అవకాశం ఇచ్చారు. తాజాగా ఒకే బైక్‌పై ముంబయి వీధుల్లో బైక్‌పై చక్కర్లు కొడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read : Champion Movie : రోషన్ హీరోగా నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ తో సినిమా