Saree Movie : రిలీజ్ కు సిద్ధమవుతున్న రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ సినిమా

ఇందులో భయపెట్టే ప్రేమికుడి పాత్రలో సత్య యాదు నటించారు...

Saree : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ డెన్‌ నుంచి వస్తున్న ‘శారీ(Saree)’ చిత్రం డిసెంబరు 20న థియేటర్‌లో విడుదలకానుంది. ఈ మేరకు మేకర్స్‌ అధికారికంగా రిలీజ్‌ డేట్‌ వెల్లడించారు. ఇందులో యువనటి ఆరాధ్య దేవి హీరోయిన్‌గా నటించగా, సత్య యాదు హీరో. పలు వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీగా రూపొందించారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి గిరి కృష్ణ కమల్ దర్శకుడు. ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమైంది. అతి ప్రేమ భయంకరంగా ఉంటుందనేది ఈ సినిమా మూల కథ.

RGV Saree Movie Updates

సోషల్‌ మీడియాలో జరిగే కొన్ని ఊహించని విషయాల వల్ల సమాజంతో పాటు వ్యక్తిగత జీవితంలో జరిగే మార్పులు ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. ఇందులో భయపెట్టే ప్రేమికుడి పాత్రలో సత్య యాదు నటించారు. కాగా.. ఈ చిత్రంలో నటించిన ఆరాధ్య దేవి కేరళకు చెందిన వర్థమాన నటి. గతంలో శ్రీలక్ష్మి అనే పేరుతో పరిశ్రమకు పరిచయమైంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎవరో తనకు ఫార్వార్డ్‌ చేసిన ఆరాధ్య రీల్స్‌ చూసి ఈమెను క‌నిపెట్టి కోత్త పేరు పెట్టి మ‌రీ ఈ ‘శారీ’ చిత్రంలో హీరోయిన్‌గా రాంగోపాల్‌ వర్మ ఎంపిక చేయడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్లు ప్రేక్షకులను అమితంగా ఆకర్షించిన విషయం తెల్సిందే.

Also Read : Hero Chiranjeevi : ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుకు ఆనందంతో ఉప్పొంగిన మెగాస్టార్

CinemaRam Gopal VarmaSareeTrendingUpdatesViral
Comments (0)
Add Comment