Renu Desai- Shocking :బూతుల ప‌ర్వం రేణూ దేశాయ్ ఆగ్ర‌హం

ఇండియా గాట్ లెటెంట్ షోపై సీరియ‌స్

Renu Desai : సోష‌ల్ మీడియా గ‌తి త‌ప్పుతోందా. రోజు రోజుకు ప్ర‌చారం కోసం కొంద‌రు ఎలా ప‌డితే అలా మాట్లాడుతూ వ్యూయ‌ర్స్ ను పెంచుకునే ప‌నిలో ప‌డ్డారు. అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఈ మ‌ధ్య‌న సినిమాలు గ‌తి త‌ప్పాయి. ఓటీటీల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

Renu Desai Shocking Comments

నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉండాల్సిన ప్రేమ‌, సెక్స్, బూతుల‌న్నీ ఇప్పుడు బ‌హిరంగ వేదిక‌ల మీద ప్ర‌త్య‌క్షం అవుతున్నాయి. స్టాండ‌ప్ కామెడీ పేరుతో కొంద‌రు విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతుంటే మ‌రికొంద‌రు ఏకంగా చెప్పుకోలేని భాష‌లో బూతులు మాట్లాడ‌టం విస్తు పోయేలా చేస్తోంది. తాజాగా ఇలాంటి ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీనికి కార‌ణం ఇండియా గాట్ లెటెంట్ షో . స్టాండ‌ప్ కామెడీ, ఇన్ ఫ్లూయెన్స‌ర్స్ , పాడ్ కాస్ట్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో స‌మ‌య్ రైనా, అపూర్వ ముఖిజ , ర‌న్వీర్ అలహాబాదియా పాల్గొన్నారు. స‌భ్య స‌మాజం సిగ్గుప‌డేలా మాట్లాడారు. బూతులు మాట్లాడుతూ పేరెంట్స్ త‌ల దించుకునేలా కామెంట్స్ చేశారు.

వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌నే డిమాండ్ పెరుగుతోంది. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ పేరుతో ఇలాంటి వ‌ల్గ‌ర్ లాంగ్వేజ్ ఎలా వాడుతారంటూ, ఎలా ప‌ర్మిష‌న్ ఇచ్చారంటూ సినీ ప్ర‌ముఖులు మండి ప‌డుతున్నారు.

ఇందుకు సంబంధించి ప్ర‌ముఖ న‌టి రేణూ దేశాయ్(Renu Desai) తీవ్రంగా స్పందించారు. ఎవ‌రిని ఉద్ద‌రించేందుకు ఈ షో చేశారంటూ మండిప‌డ్డారు. సభ్య స‌మాజానికి ఏం సందేశం ఇవ్వాల‌ని అనుకుంటున్నారో చెప్పాల‌ని అన్నారు. ముందుగా వీరిని ఇడియ‌ట్స్ అంటూ ఫైర్ అయ్యింది. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది న‌టి. ఆమె చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

Also Read : Creative -K Raghavendra Rao : ఒరేయ్ బుల్లి రాజు నీ వ‌ల్లేరా ఇదంతా

CommentsRenu DesaiShockingViral
Comments (0)
Add Comment