Renu Desai Shocking :ఛాన్స్ లు వ‌చ్చినా పిల్ల‌ల కోసం వదులుకున్నా

ప్ర‌ముఖ న‌టి రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

Renu Desai : ప్ర‌ముఖ న‌టి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆమె ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌దు. త‌ను స్వేచ్ఛ‌ను ఇష్ట ప‌డుతుంది. త‌న అభిప్రాయాల‌ను నిక్క‌చ్చిగా వెల్ల‌డిస్తుంది. మ‌న‌సులో ఏదీ దాచుకోదు. ఎదుటి వ్య‌క్తుల ఆలోచ‌న‌ల‌ను గౌర‌విస్తుంది. వ్య‌క్తిత్వానికి భంగం క‌ల‌గ‌కుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతోంది. తాజాగా చిట్ చాట్ సంద‌ర్బంగా రేణు దేశాయ్(Renu Desai) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నా ఎక్క‌డా డాబు ద‌ర్పం ప్ర‌ద‌ర్శించేందుకు ఇష్ట ప‌డ‌దు. ఇది ఆమె స్పెషాలిటీ.

Renu Desai Shocking Comments

ఈ సంద‌ర్బంగా ఎందుక‌ని రాజ‌కీయాల‌లోకి రావ‌డం లేద‌న్న ప్ర‌శ్న‌కు షాకింగ్ స‌మాధానం ఇచ్చింది రేణు దేశాయ్. త‌న‌కు ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని, కానీ తాను వాటిని ప‌ట్టించు కోలేద‌ని చెప్పింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటంటే త‌న‌కు పాలిటిక్స్ కంటే ఫ్యామిలీ ముఖ్య‌మ‌ని, అంత‌కు మించి త‌న‌కు పిల్ల‌లంటే పంచ ప్రాణ‌మ‌ని చెప్పింది. త‌న‌కు ప్ర‌కృతి అన్నా, ప‌క్షులు, జీవ జాతులు, జంతువులు అంటే ఇష్ట‌మ‌ని తెలిపింది. అంతే కాదు సామాజిక సేవ చేయ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇస్తుంద‌ని చెప్పింది రేణు దేశాయ్.

ఏ ఒక్క‌రూ ఆక‌లితో అల‌మ‌టించ కూడ‌ద‌నేది త‌న ల‌క్ష్య‌మ‌ని, అందుకే ప‌లు సేవా కార్య‌క్ర‌మాలతో జీవితం గ‌డుపుతున్నాన‌ని స్ప‌ష్టం చేసింది. ఆ మ‌ధ్య‌న తాను పాలిటిక్స్ లోకి వ‌స్తున్నానంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింద‌ని, త‌న‌కు అలాంటివి న‌చ్చ‌వ‌ని పేర్కొంది న‌టి. ఇదే స‌మ‌యంలో త‌న త‌న‌యుడు అకిరా నంద‌న్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న ఓజోలో న‌టిస్తున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై కూడా స్పందించింది రేణు దేశాయ్. ఇది పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని , ఏమైనా న‌టిస్తే తానే ప్ర‌క‌టిస్తానంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టింది .

Also Read : Hero Dhanush-Trivikram :మాట‌ల మాంత్రికుడితో త‌మిళ హీరో మూవీ

CommentsRenu DesaiShockingViral
Comments (0)
Add Comment