పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన ప్రకటన చేశారు. తనకు ప్రిన్స్ మహేష్ బాబు తో కలిసి నటించే ఛాన్స్ వచ్చిందన్నారు. కానీ తాను ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు స్పష్టం చేశారు. తాజాగా రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
ఇదిలా ఉండగా గీత గోవిందం ఫేం దర్శకుడు పరుశురామ్ దర్శకత్వం వహించారు సర్కారు వారి పాట. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో ప్రిన్స్ మహేష్ బాబు కీలక పాత్ర పోషించారు. దర్శక, నిర్మాతలను తనను సంప్రదించారని రేణు దేశాయ్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా అప్పుడప్పుడు బుల్లి తెరపై కనిపించింది. తాజాగా మాస్ మహరాజా , నుపుర్ సనన్ కలిసి నటించిన టైగర్ నాగేశ్వర్ రావు మూవీలో రేణూ దేశాయ్ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం ఓ గజదొంగ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.
దేశంలో పేరు పొందిన వ్యక్తులు, మహనీయులపై బయో పిక్ లు వచ్చాయి. కానీ ఓ దొంగపై తెలుగులో మూవీ రావడం విస్తు పోయేలా చేసింది. కాగా రేణు దేశాయ్ మీడియాతో మాట్లాడింది. తనకు సర్కార్ వారి పాటలో బ్యాంక్ ఆఫీసర్ పాత్ర ఇచ్చారని తనకు నచ్చ లేదని నో అంటూ చెప్పానని తెలిపింది.