Renu Desai: మంత్రి కొండా సురేఖతో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ భేటీ !

మంత్రి కొండా సురేఖతో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ భేటీ !

Renu Desai: ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లిహిల్స్‌ లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖని వారింట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు.భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ మంత్రి కొండా సురేఖకి వివరించారు.

Renu Desai Meet

ఈ సందర్భంగా తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్‌ ని మంత్రి కొండా సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని మంత్రి సురేఖ… రేణు దేశాయ్‌కి తన స్వహస్తాలతో అలంకరించారు. కొండా కుటుంబం తనను ఆదరించిన తీరు పట్ల రేణు దేశాయ్(Renu Desai) ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

రేణు దేశాయ్ విషయానికి వస్తే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడాకుల అనంతరం తన ఇద్దరి పిల్లరి బాగోగులు చూసుకుంటూ… సోషల్ సర్వీస్‌పై ఆమె దృష్టి పెట్టారు. రైతుల గురించి, ఇంకా యానిమల్స్, చిన్నపిల్లల ఫుడ్ కోసం ఆమె కొంత అమౌంట్ డొనేట్ చేస్తూనే… సోషల్ మీడియా ఫాలోయర్స్‌ని కూడా ఈ సర్వీస్‌లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్‌గా ఆమె ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టుబోతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read : Sai Dharam Tej: నటి పావలా శ్యామలకు సాయిధరమ్‌ తేజ్‌ ఆర్థిక సాయం !

Gita UniversityMinister Konda SurekhaRenu Desai
Comments (0)
Add Comment