Hero Ram Charan-Campa :కాంపా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా చెర్రీ

ప్ర‌క‌టించిన రిల‌య‌న్స్ సంస్థ

Ram Charan : ఇండియ‌న్ గ్లోబ‌ర్ స్టార్ గా పేరు పొందాడు ప్ర‌ముఖ న‌టుడు, మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్. త‌ను న‌టించిన ఆర్ఆర్ఆర్ తో వ‌ర‌ల్డ్ వైడ్ గా ఆక‌ట్టుకున్నాడు. ఇదే స‌మ‌యంలో త‌న బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగింది. తాజాగా ఇండియాలో పేరు పొందిన వ్యాపార సంస్థ రిల‌య‌న్స్ గ్రూప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌మ ఆధ్వ‌ర్యంలో త‌యారు చేస్తున్న పానియం కాంపా. ఇది పూర్తిగా దేశీయ బ్రాండ్. విదేశీ బ్రాండ్ల‌కు ధీటుగా మార్కెట్ లోకి రావాల‌ని యోచిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌చారం కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా త‌మ పానియం కాంపాకు స‌రైన బ్రాండ్ అంబాసిడ‌ర్ రామ్ చ‌ర‌ణ్(Ram Charan) మాత్ర‌మేన‌ని భావిస్తున్న‌ట్లు తెలిపింది.

Ram Charan As a ‘Campa’ Brand Ambassador

బాలీవుడ్, కోలీవుడ్ ,శాండిల్ వుడ్ ప‌రంగా ఎంతో మంది సినీ స్టార్లు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌త్యేకించి రామ్ చ‌ర‌ణ్ ను మాత్ర‌మే ఎంచుకోవ‌డం విస్తు పోయేలా చేసింది. కంపెనీ అధికారికంగా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించిన‌ట్లు ప్ర‌క‌టించ‌డం విశేషం. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. ఈ ఏడాది త‌ను న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ బెడిసి కొట్టింది. బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. నిర్మాత దిల్ రాజు మెడ‌కు చుట్టుకుంది. అయినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. చెర్రీ ప్ర‌స్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వంలో పెద్ది మూవీలో న‌టిస్తున్నాడు. ఇదే స‌మ‌యంలో కాంపాకు బ్రాండ్ అంబాసిడ‌ర్ కావ‌డం విశేషం.

ఈ సంద‌ర్భంగా ఓ వైపు షూటింగ్ లో పాల్గొంటూనే మ‌రో వైపు కొత్త బ్రాండ్ కు ఎండార్స్ మెంట్ పై సంత‌కం కూడా చేసేశాడు. కాంపా డ్రింక్ మార్చి 2023లో స్టార్ట్ అయ్యింది. ఇంకా దేశ వ్యాప్తంగా మార్కెట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టికే మార్కెట్ లో సంచ‌ల‌నం రేపుతోంది ఈ డ్రింక్. కాంపా వాలి జిద్ పేరుతో ప్ర‌చారం కూడా ప్రారంభ‌మైంది. ఇందుకు సంబంధించిన ఫోస్ట‌ర్స్, యాడ్స్ తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Also Read : Hero Jr NTR-Vijayashanti :తండ్రి లేని లోటును తీరుస్తున్న రాముల‌మ్మ

Bran AmbassadorGlobal Star Ram CharanTrendingUpdates
Comments (0)
Add Comment