Rekhabojo: స్ట్రీకింగ్ కు సిద్ధమంటున్న తెలుగు హీరోయిన్

ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే స్ట్రీకింగ్ కు సిద్ధమంటున్న తెలుగు హీరోయిన్

ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే స్ట్రీకింగ్ కు సిద్ధమంటున్న తెలుగు హీరోయిన్

Rekhabojo : ఐసిసి వరల్డ్ కప్-2023 లో న్యూజీలాండ్ పై ఘన విజయం సాధించి ఫైనల్ అడుగుపెట్టిన భారత్ కు విశాఖకు చెందిన నటీ రేఖాభోజ్(Rekhabojo) బోల్డ్ ఆఫర్ ప్రకటించింది. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే తాను విశాఖ బీచ్ రోడ్ లో ‘స్ట్రీకింగ్’ ( ఆనందంతో ఒంటిమీద బట్టలు లేకుండా పరుగులు పెట్టడం) కు సిద్ధమంటూ తన సోషల్ మీడియా ఖాతా నుండి సంచలన స్టేట్ మెంట్ పోస్ట్ చేసింది. గతంలో ఇండియా, పాకిస్తాన్ కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఇదే ఆఫర్ ను ప్రకటించి పాపులర్ అయ్యారు. దీనితో పాపులారిటీ కోసం రేఖభోజ్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చిందంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా గుస్సా అవుతున్నారు.

నటి రేఖాభోజ్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఇండియా గెలుస్తే… బట్టలు విప్పి పరిగెడతావా ఛీ ఛీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పాపులారిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్‌ అవుతున్నారు. అయితే వాటికి రేఖా భోజ్(Rekhabojo) కూడా సావధానంగా సమాధానం చెప్తుంది. మనస్ఫూర్తిగా ఇండియన్ క్రికెట్ టీమ్‌పై అభిమానంతో చెబుతున్నా… నాకు ఎలాంటి హైప్ అవసరం లేదు. క్రికెట్ మీద అభిమానంతో ఈ పని చేస్తున్నా తప్పితే.. హైప్ కోసం కాదు.’ అంటూ రేఖా బోజ్ పోస్ట్ చేసింది. కానీ కొందరు నెటిజన్లు మాత్రం నీ ‘స్ట్రీకింగ్’ చూడటానికి వైజాగ్‌ వచ్చేస్తామంటూ అంతే బోల్డ్‌గా కామెంట్లు చేస్తున్నారు.

Rekhabojo – రేఖాభోజ్‌ ఎవరు..?

బోల్డ్‌ సినిమా అయిన మాంగళ్యం, దామినీ విల్లా, కలాయ తస్మై నమః, కాత్సాయని, స్వాతి చినుకు, రంగీలా వంటి సినిమాల్లో నటించింది ఈ వైజాగ్ బ్యూటీ రేఖా భోజ్‌. కానీ ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో వైజాగ్‌లో సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్స్‌ సాంగ్స్‌ చేస్తూ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. గతంలో టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌పైన కూడా ఈమె చేసిన కామెంట్స్‌ వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

‘స్ట్రీకింగ్’ అంటే ఏంటి..?

ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ వంటి ఆటలలో తన జట్టు గెలిచినప్పుడు పట్టరాని ఆనందంలో కొంతమంది బట్టలిప్పి పరుగులు తీస్తుంటారు. అలా ఒంటిపై బట్టల్లేకుండా పరుగుపెట్టడాన్నే ‘స్ట్రీకింగ్‌’​ అంటారు. ఈ ‘స్ట్రీకింగ్’ కల్చర్‌ ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది. తమ అభిమాన జట్టు గెలిచినప్పుడు పట్టరాని ఆనందంతో వారు ఇలాంటి పని చేస్తుంటారు. గతంలో ఇండియా టీంకు, పాకిస్తాన్ టీంకు పలువురు సెలబ్రెటీలు ఇటువంటి ఆఫర్లు ప్రకటించడం ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఇండియా లాంటి సెక్యులర్ కంట్రీలో ఇటువంటి వాటిని ప్రోత్సహించడానికి చట్టాలు అనుమతించకపోవడంతో కేవలం పాపులారిటీ వరకు ఇటువంటి స్టేట్ మెంట్లు పనిచేస్తున్నాయి.

వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్

మొట్టమొదటి సారిగా పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్న ఐసిసి వరల్డ్ కప్-2023లో ఆతిథ్య భారత్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. లీగ్, సెమీ ఫైనల్స్ కలిపి పది మ్యాచ్ లకు పది మ్యాచ్ లు గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టింది. ముంబై వేదిగా బుధవారం న్యూజీలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ న భూతో న భవిష్యత్ అన్నట్లు సాగింది. తన 50వ సెంచరీతో విరాట్ కోహ్లీ వన్డేలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 397 పరుగుల అతి భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించి… ధీటుగా పోరాడుతున్న న్యూజీలాండ్ ను తన స్వింగ్ మాయాజాలంతో మహమ్మద్ షమీ ఏకంగా ఏడు వికెట్లను పడగొట్టడం ద్వారా రికార్డు సృష్టించాడు.

మంచి ఫామ్ లో ఉన్న భారత్ జట్టు ఆదివారం జరబోయే ఫైనల్ మ్యాచ్ కు సిద్ధపడుతోంది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా భారత్ జట్టుపై బెట్టింగ్ లు ఇప్పటినుండే ప్రారంభమవగా… ఇండియా గెలుపుపై సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖకు చెందిన రేఖా భోజ్‌(Rekhabojo) కూడా స్పందించింది. ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ గెలుస్తే…వైజాక్‌ బీచ్‌లో తన దుస్తులు తొలగించి పరుగెడుతానని ఆమె బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

Also Read : King Kohli: కోహ్లీపై సినీ ప్రముఖుల ప్రశంసలు

Rekhabojo
Comments (0)
Add Comment