Regina Cassandra : బాలీవుడ్ మీటింగ్స్ పై రెజీనా కసాండ్రా సంచలన వ్యాఖ్యలు

2019లో ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఐసా లగా మూవీతో హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రెజీనా...

Regina Cassandra : హీరోయిన్ రెజీనా కసాండ్రా… సినీరంగ ప్రవేశం చేసి అప్పుడే 20 ఏండ్లు అయింది. అతి తక్కువ స‌మ‌యంలోనే తన అందం, అభినయం, గ్లామ‌ర్‌తో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ‌త నెల‌లో ఈ అమ్మ‌డు న‌టించిన తెలుగు చిత్రం ఉత్స‌వంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ప్ర‌స్తుతం మ‌రో నాలుగైదు చిత్రాల్లో తెలుగుతో పాటు ఇత‌ర భాషల్లో న‌టిస్తోంది.

Regina Cassandra Comments

తాజాగాతెలుగు ద‌ర్శ‌కుడు బాబీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఆగ్ర న‌టుడు స‌న్నీ డియోల్‌తో చేస్తున్న జాట్ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తుంది. సినిమాల్లోకి వ‌చ్చి దాదాపు 20 యేండ్లు కావొస్తుండ‌గా బాలీవుడ్ ఎంట్రీ ఎందుకు ఆల‌స్య‌మైంద‌ని ఎదురైన ఓ ప్ర‌శ్న‌కు రెజీనా(Regina Cassandra) కామెంట్స్‌ ప్ర‌స్తుతం సోష‌ల్‌ డియాలో వైర‌ల్‌గా మారాయిఇ. 2019లో ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఐసా లగా మూవీతో హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రెజీనా.

ఆ స‌మ‌యంలో త‌న‌కు ఎదురైన ఘ‌ట‌న‌ల గురించి ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. నార్త్‌ సినిమా పరిశ్రమకు, సౌత్‌ ఇండస్ట్రీకి మధ్య తేడాలను చెప్పుకొచ్చింది. హిందీ సినిమాల్లో నటించాలనుకుంటే ముంబయిలోనే ఉండాలి. మీటింగ్స్‌ హాజరు కావాలని చెప్పారని.. ఈ విషయం తనకు నచ్చకపోయినా బాలీవుడ్‌లో అదే ముఖ్యమని అర్థమైందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ మీటింగ్స్ ఏంటి, అవెలాంటి మీటింగ్స్‌, ఎవ‌రెవ‌రు వ‌స్తారు, ఇంత‌కు ముందు ఎంత‌మంది వీటిల్లో పాల్గొన్నార‌నే చర్చ ఇప్పుడు సోషల్‌ మీడియాలో సాగుతోంది. ఇదిలాఉండ‌గా ప్ర‌స్తుతం రెజీనా హిందీ, తెలుగులో రూపొందుతున్న జాట్ సినిమాతో పాటు త‌మిళంలో అజిత్ విదాముయార్చి’తో పాటు ‘ఫ్లాష్‌బ్యాక్‌’ అనే సినిమాల్లో న‌టిస్తుండ‌గా ‘సెక్షన్‌ 108’ అనే ఓ హిందీ చిత్రం కూడా చేస్తోంది.

Also Read : Shruti Marathe : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దేవర బ్యూటీ ‘శృతి మరాఠే’

CommentsIndian ActressRegina CassandraViral
Comments (0)
Add Comment