Samantha : పుష్ప దెబ్బకు యావత్ భారత దేశ చలన చిత్ర పరిశ్రమ దర్శకుడు సుకుమార్ వైపు చూసింది. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ కే దక్కుతుంది. డిఫరెంట్ మేనరిజంతో ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాత్రను తీర్చిదిద్దాడు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ చిత్రంలో నటించి మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ కు ఊహించని ఆదాయం సమకూరింది. పుష్ప -1లో బన్నీతో పాటు రష్మిక కీలక పాత్రలు పోషించగా ఇందులో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు(Samantha) స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసింది. ఊ అంటావా మావా అంటూ చేసిన డ్యాన్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. రికార్డ్ ల మోత మోగించింది.
Samantha in Sukumar’s RC17 Movie
ఇదే మూవీకి సీక్వెల్ గా పుష్ప-2 రిలీజ్ అయింది. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు చేసిన 2వ చిత్రంగా నిలిచింది. ఏకంగా రూ. 1867 కోట్లు వసూలు చేసింది. తొలి స్థానంలో అమీర్ ఖాన్ నటించిన లగాన్ ఉంది. పుష్ప 2లో బన్నీతో పాటు రష్మిక మందన్నా సూపర్ గా చేశారు. తొలి చిత్రంలో స్పెషల్ సాంగ్ తో సమంత మెరుపులు మెరిపిస్తే సీక్వెల్ లో కిస్సక్ అంటూ ప్రత్యేక పాటలో లవ్లీ బ్యూటీ శ్రీలీల డ్యాన్స్ చేసింది. ఈ పాట కు జనం ఫిదా అయ్యారు.
తాజాగా సుకుమార్ కొత్త మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఆర్సీ 17 అని పేరు పెట్టాడని సమాచారం. ఇప్పటికే సమంతతో సుకుమార్ రామ్ చరణ్ తేజతో రంగస్థలం సినిమా తీశాడు. ఇది సూపర్ హిట్ గా నిలిచింది. మరో చిత్రానికి తనను కన్ ఫర్మ్ చేసినట్లు సమాచారం.
Also Read : Hero Mahesh Babu-SSMB29 : ఎస్ఎస్ఎంబీ29 ప్రిన్స్..జక్కన్న వైరల్