RC16 Movie : చెర్రీ సరసన ఆర్సీ16లో నటించబోతున్న జాన్వీ కపూర్

ఈ పోస్టర్‌లో జాన్వీ చీర కట్టుకుని ఉంది

RC16 Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి పాన్ ఇండియా చిత్రం ‘RC16’లో ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అరంగేట్రం చేసిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో సినిమా సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై వెంకట సతీష్ చీరాల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించనున్న హీరోయిన్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ చిత్రానికి హీరోయిన్‌ని ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్‌గా అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ని ఎంపిక చేశారు. జాన్వీ కపూర్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేశారు.

RC16 Movie Updates

ఈ పోస్టర్‌లో జాన్వీ చీర కట్టుకుని ఉంది. ఈ అధికారిక ప్రకటనతో, నిర్మాత ఆర్‌సి 16(RC16) హీరోయిన్ గురించి క్లారిటీ ఇచ్చారు. చాలా క్వాలిఫైడ్ టెక్నీషియన్స్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం యూనిట్ ఇటీవల ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో అనర్గళంగా మాట్లాడగలిగే నటీనటుల కోసం వెతుకుతోంది. ప్రధాన తారాగణం నటిస్తున్న ఈ సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు యూనివర్సల్ అప్పీల్‌తో కూడిన పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారు.

Also Read : Jayasudha: భర్త ఆత్మహత్యపై స్పందించిన సహజనటి జయసుధ ?

Janhvi KapoorMovieram charanRC16TrendingUpdates
Comments (0)
Add Comment