RBI Shocking : న్యూ ఇండియా కో ఆప‌రేటివ్ బ్యాంక్ కు షాక్

ఆర్థిక కార్య‌క‌లాపాలు నిలిపి వేయాల‌ని ఆదేశం

RBI : ముంబై – రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ముంబైలోని న్యూ ఇండియా కోఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. బ్యాంకుకు సంబంధించి అన్ని ఆర్థిక కార్య‌క‌లాపాల‌ను నిలిపి వేయాల‌ని నోటీసులు జారీ చేసింది. ఈ మేర‌కు త‌క్ష‌ణ‌మే త‌మ ఉత్త‌ర్వులు అమ‌లు లోకి వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసింది.

RBI Shocking to New India Co-operative Bank

తమ నుంచి ముందస్తు వ్రాత పూర్వక అనుమతి లేకుండా, ఏదైనా రుణాలు, అడ్వాన్స్‌లను మంజూరు చేయకూడదని పేర్కొంది. అంతే కాకుండా రెన్యువల్ కూడా చేయొద్దంటూ పేర్కొంది. కొత్త‌గా ఎవ‌రూ కూడా పెట్టుబ‌డులు ఈ బ్యాంకులో పెట్ట‌వ‌ద్దంటూ హెచ్చ‌రించింది ఆర్బీఐ(RBI).

ఇదిలా ఉండ‌గా తాము విధించిన ఈ ప‌రిమితులు ఫిబ్ర‌వ‌రి 13 నుంచి అమ‌లులోకి వ‌స్తాయ‌ని, ఈ ఆదేశాలు ఆరు నెల‌ల పాటు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది నోటీసులో. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో గుర్తించిన అవకతవకల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆంక్షలు విధించింది.
ఆర్బీఐ నోటీసులు జారీ చేయ‌డంతో ఈ బ్యాంకుకు చెందిన ఖాతాదారులు, పెట్టుబ‌డి పెట్టిన వారు, వ్యాపార‌స్తులు పెద్ద ఎత్తున బ్యాంకు వ‌ద్ద‌కు చేరుకున్నారు. బ్యాంకుకు చెందిన బ్రాంచ్ ల వ‌ద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు.

Also Read : Sadio Maane Simplicity : సాడియో మానే సింప్లిసిటీ సూప‌ర్

Comments (0)
Add Comment