Hero Raviteja Eagle: ఆకట్టుకుంటున్న రవితేజ ఈగల్.. ట్రైలర్‌!

ఆకట్టుకుంటున్న రవితేజ ఈగల్.. ట్రైలర్‌!

Raviteja Eagle: కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ(Raviteja) నటించిన సినిమా ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా… నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో తెరకెక్కించిన ఈ ట్రైలర్ కు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Raviteja Eagle – టీజర్ ఎలా ఉందంటే…

ఈగల్ మూవీ ట్రైలర్ రవితేజ మాస్ యాక్షన్, పవర్‌ఫుల్, ఎలినేషన్ డైలాగ్‍లతో పవర్ ప్యాక్డ్‌గా ఆకట్టుకునేలా ఉంది. “తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ ఆగేదెప్పుడో తెలుసా అది పట్టుకున్నవాడిని తాకినప్పుడు” అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ఇక ఇంతమందిని భయపెట్టిన వాడి గురించి నాకు తెలియాలి అంటూ అనుపమ అడగ్గానే నవదీప్ చెప్పిన డైలాగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. “వాడి గురించి తెలియాలంటే మార్గశిర మధ్యరాత్రి ఆ మొండి మోతుబరి చేసిన మారణహోమం వినాలి” అంటూ నవదీప్ చెప్పిన డైలాగ్ ట్రైలర్‌లోనే హైలెట్‌గా నిలిచింది. “విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఆపుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంశాన్ని ఆపే వినాశనం నేను” అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఆ తర్వాత హీరోయిన్ కావ్య థాపర్‌-రవితేజ(Raviteja) మధ్య లవ్ సీన్స్ చూపించారు.

ఇక చివరిగా రవితేజ చెప్పిన డైలాగ్ కూడా గట్టిగానే పేలింది. “ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు.. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు.. ఈ దేవుడు మంచోడు కాదు” అంటూ రవితేజ చెప్పిన లాస్ట్ డైలాగ్‌తో ట్రైలర్ పూర్తయింది. ఇలా ట్రైలర్ మొత్తం ప్రతి సీన్ చాలా రిచ్‌గా, ఉత్కంఠభరితంగా ఉంది. ఇక తర్వాత హెలికాప్టర్, యుద్ధ సన్నివేశాలు, తుపాకులు, బుల్లెట్లు ఇలా ప్రతి ఒక్క సీన్‌ చాలా రిచ్‌గా ఉంది. మొత్తానికి మాస్ మహారాజను చాలా వయలెంట్‌గా చూపించారు. అయితే రవితేజ మేకోవర్‌లో కూడా చాలా వేరియేషన్లు ఉన్నాయి. ఒక్కోచోట ట్రెండీ లుక్‌లో కనిపించిన రవితేజ.. మరొక చోట లుంగీ కట్టుకొని గన్స్‌తో బీభత్సం సృష్టించాడు. మ్యూజిక్ డైరెక్టర్ డావ్‍జంద్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌ను ఎంతో ఎలివేట్ చేసింది.

Also Read : Big Boss 7: బిగ్ బాస్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

eagleravi teja
Comments (0)
Add Comment