Raviteja Eagle: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా సినిమా ‘ఈగల్’. యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఫిబ్రవరి 9న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించి మంచి వసూళ్ళనే రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి… సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేనికి మంచి మార్కులు పడేలా చేసింది. కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో… రవితేజ నటన పీక్స్‌లో ఉండటమేకాకుండా ఇప్పటివరకు చూడని రవితేజను అభిమానులు చూశారు. దీనితో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
Raviteja Eagle OTT Updates
ఇప్పటికీ థియేటర్‌లో ప్రేక్షకులను అలరిస్తున్న ఈగల్(Eagle) సినిమా… త్వరలో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాను త్వరలో స్ట్రీమింగ్ కు తీసుకొస్తామని… ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. అయితే ఎప్పుడు స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంచుందనే వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే అమెజాన్ ప్రైమ్ షెడ్యూల్ ప్రకారం మార్చి 2… లేదా మార్చి 8వ తేదీన స్ట్రీమింగ్ ఫిక్స్ అని చెప్పవచ్చు. ఈ విషయంపై త్వరలోనే అమెజాన్ ప్రైమ్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. వాస్తవంగా ఈ సినిమా ఏప్రిల్ నెలలో స్ట్రీమింగ్‌కు రావచ్చని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా మార్చిలోనే ఈగల్ ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Also Read : Mahesh Babu: సుదర్శన్ థియేటర్ ను మల్టీఫ్లెక్స్ గా మారుస్తున్న స్టార్ హీరో ?