Raviteja Eagle : మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ఈగల్’. అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా పలు చిత్రాలు విడుదలవడంతో వాయిదా పడింది. ఫిబ్రవరి 9న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్స్ చూసి సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈసారి ఈ సినిమాతో రవితేజ కొత్త రూపాంతరం చెందనున్నాడు. అంటే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా… మాస్ మహారాజా పుట్టినరోజు రానుండగా. దీన్ని గుర్తుచేసుకోవడానికి, మేకర్స్ అభిమానులకు దిమ్మతిరిగే అప్డేట్ అందించారు.
Raviteja Eagle Movie Update
రేపు జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా మాస్ మహారాజా కొత్త మేకోవర్‌ని ఆవిష్కరించి, చిత్రంలోని మూడో పాటను రేపు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా విడుదలైన రవితేజ పోస్టర్ ఆకట్టుకుంటోంది. రవితేజ(Raviteja) స్టైలిష్ పోనీటైల్ ధరించాడు. మరి రేపటి సర్ప్రైజ్ ఎలా ఉంటుందో చూద్దాం. డేవ్ జాన్ డి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా సమస్త నిర్మిస్తోంది.
ఇంకోపక్క చుస్తే సోలో డేట్ ఇవ్వాలంటూ ఫిల్మ్ ఛాంబర్ కి కొద్ది రోజుల క్రితం పీపుల్స్ మీడియా లేఖ రాసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్‌లు బిజీగా ఉన్నాయి. దీంతో ఫిలిం ఛాంబర్ అధికారులు రవితేజ సినిమాని వాయిదా వేయాలని కోరారు, అందుకే ‘ఈగల్ ‘ చిత్రాన్ని ఫిబ్రవరి 9కి వాయిదా వేసినట్లు తెలిపారు.అయితే ఇప్పుడు ఈగల్ థియేటర్లలోకి రావడానికి సిద్దమవుతున్న సమయంలోనే మరిన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. యాత్ర 2 ఫిబ్రవరి 8న, సందీప్ కిషన్ భైరవ కోన, లాల్ సలామ్ ఫిబ్రవరి 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Also Read : Prasanth Varma : రామాయణ మహాభారతాన్ని ఆ దర్శకుడు తీయకపోతే నేను తీస్తాను