Raviteja Eagle: సంక్రాంతి బరి నుండి తప్పుకున్న రవితేజ ‘ఈగల్‌’

సంక్రాంతి బరి నుండి తప్పుకున్న రవితేజ ‘ఈగల్‌’

Raviteja Eagle: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్, వెంకటేష్ హీరోగా సైంధవ్, నాగార్జున హీరోగా నా స్వామి రంగా వంటి భారీ బడ్జెట్ సినిమాలతో పాటు అరడజనుకు పైగా తమిళ డబ్బింగ్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

దీనితో పెద్ద సినిమాలకు కూడా థియేటర్లు దొరకడం చాలా కష్టంగా మారింది. దీనితో సినీ పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ఆయా సినిమాల నిర్మాతలతో చర్చలు జరిపాయి. రోజుల వ్యవధిలోనే ఐదు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైతే ఎలాంటి పరిణామాలుంటాయనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు ‘ఈగల్‌’ నిర్మాత తమ సినిమాని వాయిదా వేసేందుకు అంగీకరించారు. ఇదే విషయాన్ని ‘ఈగల్‌’ తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది.

Raviteja Eagle – ఫిబ్రవరి 9న తగ్గేదేదే లేదంటున్న ‘ఈగల్‌’

సంక్రాంతి బరి నుండి తప్పుకుంటున్నట్లు నిర్మాతలు ప్రకటించడంతో… మాస్ మహారాజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం‘ఈగల్‌(Eagle)’ కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తూ చిత్ర యూనిట్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ‘‘బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం. మొండోడి మనసు పుట్ట తేనె. సంక్రాంతి బరి నుంచి ‘ఈగల్‌(Eagle)’ను ఫిబ్రవరికి తీసుకొచ్చాం. అందరూ చూడాల్సిన జనరంజక చిత్రం ప్రదర్శించడానికి అంతే మొత్తంలో థియేటర్లు కావాల్సి ఉంటుంది. దర్శకుడు, టీమ్‌ పనిని ప్రేక్షకులు చూసి మెచ్చుకోవడానికి ఇరుకులేని వేదిక, సమయం కావాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నాం. మారింది తేదీ మాత్రమే మాసోడి మార్క్‌ కాదు’’ అని ట్వీట్‌ చేసింది. దీనితో ఫిబ్రవరి 9న ‘ఈగల్‌’ను విడుదల చేయనున్నట్లు ప్రకటించకనే ప్రకటించింది చిత్ర యూనిట్. దీనితో మాస్ మహారాజ్ మనసు పుట్టతేనె మనసు… దాని వెనుక ఉన్న మాసోడి మార్క్ చూడటానికి మేము వెయిటింగ్ అంటూ రవితేజ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Also Read : Poonam Kaur : గుంటూరు కారం కాపీ కొట్టిన త్రివిక్రమ్ – పూనమ్ కౌర్

eagleraviteja
Comments (0)
Add Comment