Ravi Teja: ‘మిస్టర్‌ బచ్చన్‌’సెంకడ్ సింగిల్ రిలీజ్ !

'మిస్టర్‌ బచ్చన్‌'సెంకడ్ సింగిల్ రిలీజ్ !

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, ధమాకా ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ లుక్, షో రీల్ మరియు ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

Ravi Teja Movie Updates

ఈ నేపథ్యంలో ఇప్పటికే సితార్‌ అనే ఫస్ట్ సాంగ్‌ ను రిలీజ్‌ చేయగా… ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెప్పల్ డప్పుల్‌ అంటూ సాగే పాటను విడుదల చేయగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనుండగా… మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు.

Also Read : Suriya: ఉద్యోగం నాకు నచ్చక యూటర్న్‌ తీసుకుని హీరో అయ్యా – సూర్య

Mr BachchanPeoples Media Factoryravi teja
Comments (0)
Add Comment