Mass Jathara : పవర్ ఫుల్ పోలీస్ పాత్రలలో నటించాలంటే రవితేజ(Ravi Teja) ఉండాల్సిందే. తనతో పాటు బాలయ్య కూడా బెటరే. కానీ పవర్ ఫుల్ డైలాగులకు పెట్టింది పేరు మాస్ మహారాజా. తను డ్యాన్సులతో హోరెత్తిస్తాడు. ఫైట్స్ తో ఆకట్టుగోలడు. ఏది ఏమైనా తను డైరెక్టర్స్ హీరో. అందుకే తనతో గోపిచంద్ మలినేని పవర్ ఫుల్ మూవీ తీశాడు. అందులో పోలీస్ పాత్రకు ఎక్కువగా మార్కులు పడ్డాయి. తాజాగా మరో సారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో రానున్నాడు రవితేజ. అదే మాస్ జాతర మూవీ. టైటిల్ కు తగ్గట్టు అద్భుతమైన సీన్స్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. తనలోని నటనను మరోసారి వెలికి తీసేందుకు నానా తంటాలు పడుతున్నాడు.
Mass Jathara Movie Updates
ఇక ఇప్పటికే పలు సార్లు పోలీస్ ఆఫీసర్స్ పాత్రల్లో నటించిన రవితేజకు ఈ పాత్ర ఓ లెక్క కాదు. దుమ్ము రేపాడు. పవర్ ఫుల్ గా తన భావోద్వేగాలను పలికించాడు. ఇక తనతో పోటీ పడుతోంది మరోసారి అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. తనతో ఇది రెండో సినిమా చేయడం. గతంలో ప్రముఖ దర్శకుడు త్రినాథరావు మక్కిన తీసిన ధమాకా మూవీలో రెచ్చి పోయింది. రవితేజ, శ్రీలీల ఎవరికి వారే పోటీ పడి నటించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ ఇద్దరి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా మూవీ మేకర్స్ ఈ మూవీని వచ్చే మే 9న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అదే రోజు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రానుందని టాక్. ఇది పక్కన పెడితే తాజాగా రవితేజ మాస్ జాతర(Mass Jathara) మూవీకి సంబంధించి సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. సూపర్ టాక్ వచ్చింది దీనికి. ఇక సంక్రాంతికి వస్తున్నాం మూవీని తన సంగీతంతో బ్లాక్ బస్టర్ అయ్యేలా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో ఈ చిత్రానికి అందిస్తుండం విశేషం.
Also Read : Hero Siddu – Jack Movie :ముద్దు కోసం తహ తహ గుండెల్లో దడదడ