Ravi Teja : టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న నటుడు మాస్ మహరాజా రవితేజ నటించిన మాస్ జాతర మూవీకి సంబంధించి మూవీ మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. జనవరి 26 తన పుట్టిన రోజు. ఈ సందర్బంగా హీరో ఫ్యాన్స్ కు కిర్రాకు తెప్పించేలా తీసేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించాడు దర్శకుడు భాను భోగవరపు. గతంలో రవితేజ నటించిన మూవీస్ భిన్నంగా ఉండబోతోందని చెప్పాడు.
Hero Ravi Teja Movie Updates
నటనలోనూ, డైలాగ్ డెలివరీలోనూ తనకంటూ ఓ స్పెషాలిటీ కలిగి ఉన్న ఏకైక నటుడు రవితేజ(Ravi Teja). తను ఒక్కసారి కమిట్ అయ్యాడంటే పూనకాలు రావాల్సిందే. మాస్ ఆడియన్స్ నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆమోద యోగ్యంగా ఉండేలా సినిమాలలో తన పాత్రలు ఉండేలా జాగ్రత్త పడతాడు. అందుకే సక్సెస్ ఫెయిల్యూర్ తో పని లేకుండా కామ్ గా తన పని తాను చేసుకుంటూ పోతాడు ఈ మాస్ మహరాజా.
ఇప్పటికే మాస్ జాతర మూవీకి సంబంధించిన పోస్టర్స్ దుమ్ము రేపుతున్నాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రవితేజ ఇమేజ్ కు తగ్గట్టే దీనిని తీస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇక దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ బిగ్ సక్సెస్ అయ్యింది. దీనిలో కీలక పాత్ర పోషించాడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిలిరో. తనే రవితేజ మాస్ జాతరకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. గతంలో ధమాకా మూవీకి కూడా సంగీతం ఇచ్చాడు.
ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే గ్లింప్స్ కూడా ఉండడం విశేషం.
Also Read : Hero Charan-AR Rahman : చెర్రీ మూవీకి రెహమానే సంగీత దర్శకుడు