Ravi Teja Eagle: సినిమా టిక్కెట్ రేటును తగ్గించిన ‘ఈగల్‌’ టీమ్ !

సినిమా టిక్కెట్ రేటును తగ్గించిన ‘ఈగల్‌’ టీమ్ !

Ravi Teja Eagle: పెద్దహీరో సినిమా వస్తుందంటే చాలు… టిక్కెట్టు రేటు ఎంత పెంచుకుంటారా అని ఆలోచిస్తాడు సగటు ప్రేక్షకుడు. సినిమా బడ్జెట్ బట్టి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలతో వారికున్న సత్సంబంధాలు బట్టి కొత్త సినిమా టిక్కెట్ల రేట్లు విపరీతంగా పెంచుకుంటారు. సినిమా హిట్, ఫట్ అని సంబంధం లేకుండా బడ్జెట్ మొత్తం మొదటి వారంలో ప్రేక్షకుల నుండి వసూలు చేసేలా నిర్మాతలు, డిస్ట్రీబ్యూటర్లు ప్లాన్ వేసుకుంటారు. అయితే మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఈగల్‌’ సినిమా యూనిట్ డేరింగ్ స్టెప్ తీసుకుందనే చెప్పుకోవాలి. యాక్షన్ థ్రిల్లర్ గా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు… టిక్కెట్ల రేట్లను పెంచకపోగా… తిరిగి తగ్గిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సాధారణ ప్రేక్షకుడికి కూడా అందుబాటులో విధంగా ఈ టిక్కెట్ల ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Ravi Teja Eagle – ‘ఈగల్‌’ సినిమా టిక్కెట్ల రేటు ఎంతంటే ?

తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ.295 నిర్ణయించే అవకాశం ఉన్నా… చిత్ర యూనిట్ సినిమాను రూ.200లకే అందిస్తోంది. అదేవిధంగా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.150కే ‘ఈగల్‌’ మూవీ టికెట్‌ ధరలను పరిమితం చేసింది. సినిమాను వీలైనంత ఎక్కువమందికి చేరువ చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుకింగ్స్‌ కూడా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి, మార్చిలో విద్యార్థులకు పరీక్షలు జరిగే సమయం కావడంతో చాలా మంది సినిమాలకు దూరంగా ఉంటారు. ఈ క్రమంలో కంటెంట్‌ పై ఉన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ(Ravi Teja), అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘ఈగల్‌’. యాక్షన్ థ్రిల్లర్ గా ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్న ఈ సినిమాలో నవదీప్, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడంతో పాటు సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచేసాయి. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ టిక్కెట్టు ధరలను తగ్గిస్తూ డేరింగ్ స్టెప్ తీసుకుందనే చెప్పుకోవచ్చు.

Also Read: The Kerala Story: ఓటీటీలోకి వివాదాస్పద సినిమా ‘ద కేరళ స్టోరీ’ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

eagleravi teja
Comments (0)
Add Comment