Ravi Teja: న్యాయం కోసం ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించిన ‘ఈగల్‌’ టీమ్‌ !

న్యాయం కోసం ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించిన 'ఈగల్‌' టీమ్‌ !

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైనప్పటికీ… థియేటర్ల కొరత కారణంగా తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ప్రతినిధుల అభ్యర్ధన మేరకు సంక్రాంతి బరి నుండి ‘ఈగల్‌’ తప్పుకుంది.

Ravi Teja Movie Updates

దీనితో ‘‘బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం. మొండోడి మనసు పుట్ట తేనె. సంక్రాంతి బరి నుంచి ‘ఈగల్‌’ను ఫిబ్రవరి 9 కి తీసుకొచ్చాం. మారింది తేదీ మాత్రమే మాసోడి మార్క్‌ కాదు’’ అని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనితో సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్, వెంకటేష్ హీరోగా సైంధవ్, నాగార్జున హీరోగా నా స్వామి రంగా సినిమాల విడుదలకు మార్గం సుగమమం అయింది. థియేటర్ల కేటాయింపు విషయంలో హనుమాన్ సినిమాకు కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ… రవితేజ(Ravi Teja) ‘ఈగల్‌’ సంక్రాంతి బరి నుండి తప్పుకోవడం మిగిలిన సినిమాలకు ప్లస్ అయింది.

అయితే ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల అభ్యర్ధన మేరకు సంక్రాంతి బరి నుండి తప్పుకుని… ఫిబ్రవరి 9 న రావాలనుకుంటున్న ‘ఈగల్‌’ సినిమాకు ఈ సారి కూడా థియేటర్ల కష్టాలు తప్పడం లేదు. ఫిబ్రవరి 8న యాత్ర-2, ఊరు పేరు భైరవకోన చిత్రాలతో పాటు ఫిబ్రవరి 9న లాల్‌ సలామ్‌ విడుదల కానుంది. అంటే ఈగల్‌ సినిమాతో కలిపి మొత్తంగా నాలుగు సినిమాలు ఆ వారంలో రిలీజ్ అవుతున్నాయి. దీనితో ఈగల్‌ సినిమాకు సంబంధించిన పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ యాజమాన్యం…. ‘సోలో రిలీజ్ డేట్‌’ తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఛాంబర్‌ను ఆశ్రయించింది.

జనవరి 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఛాంబర్ పెద్దల నిర్ణయం మేరకు సంక్రాంతి బరి నుంచి వైదొలిగి… ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యామని… అయితే ఇప్పుడు అదే రోజు మరికొన్ని చిత్రాలు విడుదలవుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమకు ఇచ్చిన ‘సోలో రిలీజ్ డేట్‌’ మాట నిలబెట్టుకోవాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ లేఖ ద్వారా ఫిల్మ్ ఛాంబర్‌ను కోరింది. గతంలో తమ సినిమాకు ఇస్తానన్న ‘సోలో రిలీజ్ డేట్‌’ హామీను నిలబెట్టుకోవాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈగల్ సినిమా సోలోగా విడుదలయ్యేలా సహకరించాలని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ను కోరింది. అయితే పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ రాసిన లేఖకు ఫిల్మ్ ఛాంబర్ నుండి ఇంకా ఎలాంటి సమాధానం వెలువడలేదు.

Also Read : Mohan Lal: ఓటీటీలో మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ సినిమా ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

eagleravi teja
Comments (0)
Add Comment