Ravi Teja: హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్న రవితేజ !

హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్న రవితేజ !

Ravi Teja: ‘ఈగిల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన తరువాత మాస్ మహారాజ్ రవితేజ… వరుస సినిమాలతో జోరుమీద ఉన్నాడు. తాజాగా రవితేజ తన 75వ సినిమాను హిట్ కాంబినేషన్ తో రిపీట్ చేయడానికి సిద్ధమైయ్యారు. తన 75వ సినిమాను కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇది వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రీకరణను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది చిత్ర బృందం.

Ravi Teja Movie Updates

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న చిత్ర యూనిట్… ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన ప్రధాన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది చిత్ర బృందం. ఇందులో భాగంగా రవితేజకు జోడీగా శ్రీలీలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర బృందం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. శ్రీలీల ఇప్పటికే రవితేజతో కలిసి ‘ధమాకా’లో సందడి చేసిన సంగతి తెలిసిందే. అది బాక్సాఫీస్‌ ముందు మంచి విజయాన్ని దక్కించుకుంది.

Also Read : Ananya Panday: ‘కాల్‌ మీ బె’ అంటున్న బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే !

ravi tejaSree Leela
Comments (0)
Add Comment