Ravi Basrur: ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటుకున్న రవి బస్రూర్ !

ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటుకున్న రవి బస్రూర్ !

Ravi Basrur: కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్‌… యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ పై అభిమానాన్ని చాటుకున్నారు. ‘వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం’ అంటూ ఎన్టీఆర్‌ పై ప్రత్యేక పాటను రూపొందించారు. కుటుంబంతో కలిసి ఎన్టీఆర్‌ ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. నటుడు రిషబ్‌ శెట్టి, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో కలిసి రవి బస్రూర్‌(Ravi Basrur) స్టూడియోను సందర్శించారు. తన స్టూడియోకు ఎన్టీఆర్‌ వెళ్లడంపై ఆనందం వ్యక్తం చేసిన రవి తనదైన శైలి సాంగ్‌ ను కానుకగా ఇచ్చారు. ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌- రవి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం’ అంటూ సాగే పాట అభిమానులను ఆకట్టుకుంది. అలా తారక్‌పై తనకున్న అభిమానాన్ని రవి బస్రూర్‌ చాటుకున్నాడు.

Ravi Basrur – ఎన్టీఆర్‌-నీల్‌ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం !

ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా రవి బస్రూర్‌ అని తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా… పాన్‌ ఇండియా రేంజ్‌లో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Dhanush: హీరో ధనుష్‌పై రెడ్‌ కార్డ్‌ ఎత్తివేత ! కొత్త ప్రాజెక్ట్‌ లకు లైన్‌ క్లియర్‌ !

Jr NTRprasanthneelRavi Basrur
Comments (0)
Add Comment