Rashmika : లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన మరాఠా యోధుడు ఛత్రపతి శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఛావా. పోరాట సన్నివేశాలు, ఆనాటి జ్ఞాపకాలను కళ్ల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ఇది ఇండియన్ సినిమా తెర మీద ఒక దృశ్య కావ్యంగా ఉండబోతోందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.
Rashmika-Vicky Kaushal Movie
పుష్ప-2 మూవీతో దేశ వ్యాప్తంగా కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకున్న రష్మిక(Rashmika) ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో మహారాజ్ భార్య ఏసుబాయ్ పాత్రను పోషించింది. తన సినీ కెరీర్ లో మరిచి పోలేని పాత్ర ఏదైనా ఉందంటే ఇదేనని పేర్కొన్నారు.
శంబాజీ మహారాజ్ ఎవరో కాదు ఛత్రపతి శివాజీ తనయుడు. ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా ఛావా చిత్రం విడుదల కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లో చిత్ర బృందం సందడి చేసింది. భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీపై.
ఈ చరిత్రాత్మక చిత్రానికి గతంలో ఏ సినిమాకు అందించని రీతిలో సంగీతాన్ని అందించేందుకు ప్రయత్నం చేశానని అన్నాడు దిగ్గజ సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్. ఈ ఛావాలో ప్రేమ, దైవత్వం కలగలిసి ఉంటాయన్నాడు.
Also Read : Varalaxmi Interesting : తనంటే నాకు చచ్చేంత ఇష్టం