Beauty Rashmika : నేష‌న‌ల్ క్ర‌ష్ ఏసుబాయిపై ఉత్కంఠ

ర‌ష్మిక మంద‌న్నా లుక్ అదుర్స్

Rashmika : నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. ఏసుబాయి మూవీలో త‌ను ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ట్రైల‌ర్ లాంచ్ కు సంబంధించి ఫిక్స్ చేశారు మూవీ మేక‌ర్స్. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఏసుబాయి మూవీ ప్ర‌ధానంగా మ‌రాఠా యోధుడిగా కీర్తించే ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించారు.

Rashmika Mandanna…

ఈ మూవీ కోసం ఏరికోరి ర‌ష్మిక మంద‌న్నా(Rashmika)ను తీసుకున్నారు ద‌ర్శ‌క, నిర్మాత‌లు. ఈ చిత్రంలో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. శివాజీ భార్య‌నే ఏసుబాయి. త‌న పాత్ర‌లో లీన‌మై న‌టించింద‌న్న టాక్ నెల‌కొంది.

ఇదిలా ఉండ‌గా త‌న సినీ కెరీర్ లో ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌లో న‌టించింది నేష‌న‌ల్ క్ర‌ష్. ప్ర‌స్తుతం చారిత్రాత్మ‌క‌మైన పాత్ర‌కు త‌న‌ను ఎంపిక చేయ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నారు. స్వ‌రాజ్యం గ‌ర్వ‌ప‌డే మ‌హారాణి ఏసుబాయి అంటూ న‌టి పేర్కొంది. సోష‌ల్ మీడియాలో ఏసుబాయి చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఈ మూవీని వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేయాల‌ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : Sr Hero Amitabh : అపార్ట్‌మెంట్ అమ్మ‌కం బ‌చ్చ‌న్ కు ఆదాయం

MoviesRashmikaTrendingUpdates
Comments (0)
Add Comment