Rashmika Mandhanna : ర‌ష్మిక మందన్నా వైర‌ల్

ది గ‌ర్ల్ ఫ్రెండ్ మూవీ ఫ‌స్ట్ లుక్

Rashmika Mandhanna : ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారింది క‌న్న‌డ సినీ రంగానికి చెందిన ర‌ష్మిక మంద‌న్నా. త‌ను బ‌న్నీతో క‌లిసి న‌టించిన పుష్ప ది రైజ్ దుమ్ము రేపింది. దేశ వ్యాప్తంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

Rashmika Mandhanna First Look Viral

నేష‌న‌ల్ వైడ్ గా క్ర‌ష్ గా మారింది. ప్ర‌స్తుతం అర్జున్ రెడ్డి తో దుమ్ము రేపిన డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ బీర్ క‌పూర్ తో ర‌ష్మిక మంద‌న్నా యానిమ‌ల్ మూవీలో న‌టిస్తోంది.

తాజాగా మ‌రో సినిమాకు సంబంధించి అప్ డేట్ వ‌చ్చింది. త‌ను రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ది గ‌ర్ల్ ఫ్రెండ్ మూవీలో న‌టిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ఫ్యాన్స్ ను ఆక‌ట్టుకుంటోంది. మ‌ల‌యాళం సినీ రంగానికి చెందిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ ర‌ష్మిక(Rashmika Mandhanna) మూవీకి మ్యూజిక్ ఇస్తున్నాడు.

ఈ చిత్రానికి కృష్ణ‌న్ వ‌సంత్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ది గ‌ర్ల్ ఫ్రెండ్ చిత్రానికి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం రాహుల్ ర‌వీంద్ర‌న్ నిర్వ‌హించాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పిస్తుండ‌డం విశేషం. విద్యా కొప్పినీడి, ధీర‌జ్ మొగిలినేని ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక బ‌న్నీ స‌పోర్ట్ ఉండ‌నే ఉంటుంది. సినిమా ప‌క్కాగా స‌క్సెస్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు.

Also Read : Priyanka Upendra: హర్రర్ సినిమాతో వస్తున్న ఉపేంద్ర భార్య

Comments (0)
Add Comment