Rashmika Mandhanna : ఆ చిత్రంపై ర‌ష్మిక హాట్ కామెంట్స్

నేను ఫిర్యాదు చేయ‌ద‌ల్చు కోలేదు

అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక మంద‌న్నా గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఈ అమ్మ‌డు క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌కు చెందినా ఆ త‌ర్వాత తెలుగులో త‌ళుక్కున మెరిసింది. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో న‌టించింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుష్ప ది రైజ్ చిత్రంతో మెరిసింది. ఈ సినిమాలో లీడ్ రోల్ లో బ‌న్నీ స‌ర‌స‌న న‌టించినా ఎక్కువ మార్కులు ర‌ష్మిక కంటే స్పెష‌ల్ సాంగ్ లో న‌టించిన సమంత రుత్ ప్ర‌భుకు ప‌డ్డాయి.

ఇక రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో న‌టించిన గీత గోవిందం ర‌ష్మిక మంద‌న్నా తెలుగు వారి హృద‌యాల‌లో నిలిచి పోయింది. మంచి న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ప‌రుశురామ్ తీశాడు. ఆ త‌ర్వాత ప్రిన్స్ మ‌హేష్ బాబుతో స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో న‌టించింది. నీకు అర్థ‌మ‌వుతుందా అన్న డైలాగ్ తో ఒక్క‌సారిగా నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారింది.

ఇదే స‌మ‌యంలో పోటా పోటీగా న‌టించారు ర‌ష్మిక‌, స‌మంత‌. రారా సామీ అంటూ చేసిన పాట‌కు జ‌నం ఫిదా అయ్యారు. ఈ త‌రుణంలో తాజాగా ముద్దుల‌తో ముంచెత్తింది. యువ‌త‌ను కిరాక్ తెప్పించేలా చేసింది. ఇంకా సినిమా రిలీజ్ కానేలేదు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. కార‌ణం వంగా సందీప్ రెడ్డి తీసిన యానిమ‌ల్ మూవీలో ర‌ణ బీర్ క‌పూర్ తో క‌లిసి కిస్సుల‌తో కిర్రాక్ తెప్పించేలా చేసింది.

కాగా ఈ సినిమాకు సంబంధించి అనుకోని ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనిపై తాను ఫిర్యాదు చేయాల‌ని అనుకోవడం లేదంటూ స్ప‌ష్టం చేసింది.

Comments (0)
Add Comment