నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందింది అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. కర్ణాటకకు చెందిన ఈ లవ్లీ గర్ల్ ప్రస్తుతం ఫుల్ బిజీగా మారి పోయింది. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన యానిమల్ లో నటిస్తోంది. ఇందులో రణ బీర్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ , సాంగ్ దుమ్ము రేపుతోంది. ఇందులో హద్దులు దాటేసింది ఈ ముద్దుగుమ్మ. ముద్దులతో హోరెత్తించింది.
ఇక తాజాగా మరో సీక్వెల్ మూవీతో మన ముందుకు రాబోతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప ది రైజ్ రికార్డ్ బ్రేక్ చేసింది. పాన్ ఇండియా లెవల్లో మోత మోగించింది. ఈ సినిమాకు తొలిసారిగా తెలుగు సినిమా రంగం తరపున ఇందులో నటించి మెప్పించిన పుష్ప రాజ్ అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు.
ఇక పుష్పలో రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా సక్సెస్ తో పుష్ప మూవీ సీక్వెల్ గా పుష్ప -2 రాబోతోంది. ఇదిలా ఉండగా ఆమె చేతిలో ఈ ఏడాది పలు సినిమాలకు సంతకాలు చేసింది రష్మిక . ఇందులో శేఖర్ కమ్ములతో సినిమా చేయబోతోంది. లేడీ ఓరియంటెడ్ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించింది ముద్దుగుమ్మ.
తాజాగా గీతా ఆర్ట్స్ కీలక ప్రకటన చేసింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్నాతో గర్ల్ ఫ్రెండ్ చేయనున్నట్లు తెలిపింది.