Rashmika : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న సంచలనంగా మారింది. పుష్ప -1, పుష్ప-2 మూవీస్ తో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతే కాదు యానిమల్ తో దుమ్ము రేపింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో సికిందర్ చిత్రంతో అలరించనుంది. నేషనల్ క్రష్ గా మారి పోయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన నికర ఆస్తుల విలువ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సందర్బంగా ప్రముఖ ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే ఈ పత్రిక ప్రతి ఏటా దేశంలోని క్రీడాకారులు, సినీ రంగానికి చెందిన నటీ నటుల నికర ఆస్తుల విలువ ఎంత ఉందనేది జాబితాను రిలీజ్ చేస్తుంది.
Rashmika Mandanna Assets Value
తాజాగా సదరు పత్రిక రష్మిక మందన్నా(Rashmika) గురించి ఆసక్తికర ప్రకటన చేసింది. అదేమిటంటే తన నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 100 కోట్లు దాటి పోయిందని వెల్లడించింది. విషయం తెలిసిన వెంటనే ఫ్యాన్స్ విస్మయానికి లోనయ్యారు. తను వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో దూసుకు పోతోంది. ప్రత్యేకించి సుకుమార్ డైరెక్షన్ లో తను నటించిన పుష్ప -2 దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన రెండో చిత్రంగా చరిత్ర సృష్టించింది. రూ. 1860 కోట్లు వసూలు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.
ఫోర్బ్స్ ప్రకారం రష్మిక మందన్న(Rashmika) 28 ఏళ్ల వయసులో ఇప్పటికే రూ. 66 కోట్ల నికర విలువను నిర్మించుకుంది. ఒక్కో మూవీకి పారితోషకం కింద రూ. 4 కోట్ల నుండి రూ. 8 కోట్ల దాకా వసూలు చేస్తున్నట్లు టాక్. తాజా చిత్రం ఛావా భారీ విజయంతో తన నికర వాల్యూ రూ. 100 కోట్లు దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
యానిమల్ రూ. 1000 కోట్లు వసూలు చేసింది. ఇక సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లకు కూడా పని చేస్తోంది. రష్మిక మందన్నాకు చెందిన ఆస్తులు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, గోవా, కూర్గ్ లలో ప్రీమియం ఆస్తులను కలిగి ఉంది. రోజు రోజుకు తాను కొనుగోలు చేసిన ఆస్తుల విలువ మరింత పెరుగుతోందని, దాని కారణంగానే ఆమె నికర ఆస్తుల విలువ వంద కోట్లు దాటేసిందని అంటున్నారు క్రిటిక్స్.
Also Read : Popular Actor Raghuvaran : రఘు వరన్ జర్నీ డాక్యుమెంటరీ