Rashmika Mandanna : మరో బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిన రష్మిక

నా తదుపరి సినిమా ఏంటని సినీ అభిమానులు చాలా కాలంగా అడుగుతున్నారు....

Rashmika Mandanna : “యానిమల్‌” సినిమాతో బాలీవుడ్‌లో పెద్ద హిట్‌గా నిలిచిన జాతీయ తార రష్మికకు తాజాగా ఓ భారీ ఆఫర్ వచ్చింది. కొన్నాళ్లుగా రష్మికను అభిమానులు అడుగుతున్న ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చింది. తాజాగా బాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌కి సైన్ చేసింది. సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ‘సికందర్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! తాజాగా సల్మాన్, మురుగదాస్, సాజిద్ నదియావాలా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నేషనల్ ఫేవరెట్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది.

Rashmika Mandanna Movies Updates

“నా తదుపరి సినిమా ఏంటని సినీ అభిమానులు చాలా కాలంగా అడుగుతున్నారు. అది నన్ను కూడా ఆశ్చర్యపరిచింది. ‘సికందర్’లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది.” సల్మాన్‌తో స్క్రీన్‌ స్పేస్‌ను పంచుకోవడానికి నేను ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రాన్ని 2025 ఈద్‌కి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అని రష్మిక ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె పలు సినిమాల షూటింగ్‌లలో బిజీగా ఉంది. పుష్ప-2, రైనా బో, ది గర్ల్‌ఫ్రెండ్, చావా, కుబేర.

Also Read : Thug Life Movie : ‘థగ్ లైఫ్’ లో సరికొత్త లుక్ తో అలరిస్తున్న శింబు

MoviesRashmika MandannaTrendingUpdatesViral
Comments (0)
Add Comment