Rashmika Mandanna: చీర కట్టు, పులి గోరుతో రష్మిక లుక్ అదుర్స్‌ !

చీర కట్టు, పులి గోరుతో రష్మిక లుక్ అదుర్స్‌ !

Rashmika Mandanna: ‘పుష్ప’ సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా… ఆ తరువాత తమిళంలో విజయ్ తో వారసుడు, బిగ్ బి అమితా బచ్చన్ తో గుడ్ బై సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. తాజాగా రణ్ బీర్ కపూర్ సరసన నటించిన ‘యానిమల్’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. దీనితో సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ లో కూడా భారీగా ఆపర్లు వస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప-2లో నటిస్తున్న రష్మిక… తాజాగా చీర కట్టు, పులి గోరుతో చిన్న కళ్ళద్దాలు పెట్టి స్పెషల్ లుక్ లో దర్శనమిచ్చింది. దీనితో రష్మిక(Rashmika Mandanna) అభిమానులతో పాటు సినీ ప్రియులు చూపు తిప్పుకోనివ్వడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

Rashmika Mandanna Looks Viral

ఇప్పటికే పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్… ఓ స్త్రీ వేషంలో గంగమ్మ తల్లికి మ్రొక్కు తీర్చుకునే లుక్ ను తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనితో ప్రస్తుతం రష్మిక గెటప్ చూసి రష్మిక గెటప్ కూడా పుష్ప సినిమా కోసమే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజాగా నెట్టింట వైరల్ గా మారుతున్న ఈ ఫోటోలు చూస్తే నేషనల్ క్రష్ రష్మిక… ఓ బిస్కట్ కంపెనీకు ఇస్తున్న కమర్షియల్ యాడ్ కు సంబంధించిన గెటప్ గా తెలుస్తోంది. రస్కిట్ అనే బిస్కెట్ కంపెనీకు చెందిన యాడ్ లో నేషనల్ క్రష్ నటించినట్లు తెలుస్తోంది.

Also Read : Rana Daggubati: రానా ‘రాక్షస రాజా’ లో మలయాళ సూపర్ స్టార్ ?

animalRashmika Mandanna
Comments (0)
Add Comment