Rashmika Mandanna: అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా తెరకెక్కించిన తాజా సినిమా ‘యానిమల్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నేషనల్ క్రష్ రష్మిక… కాలుకు బలపం కట్టుకుని దేశమంతా తిరిగి సందడి చేసింది.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైద్రాబాద్, కొచ్చి ఇలా దేశంలోని ప్రధాన పట్టణాలకు తిరుగుతూ గడచిన పది పదిహేను రోజులుగా క్షణం తీరిక లేకుండా ‘యానిమల్’ చిత్ర యూనిట్ తో కలిసి ప్రచారం చేసింది. అయితే చిత్ర యూనిట్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. కేవలం నాలుగు రోజుల్లో నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు చేసి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Rashmika Mandanna – ‘ది గర్ల్ ఫ్రెండ్’ షూటింగ్ షురూ చేసిన రష్మిక
గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న రష్మికకు… ‘యానిమల్’ మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. దీనితో ‘యానిమల్’ సక్సెస్ ను ఆస్వాదిస్తూనే తిరిగి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించింది. రష్మిక(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసారు.
చి.ల.సౌ, మన్మథుడు 2తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హైదరాబాద్ లో షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసారు. దీనితో రష్మిక(Rashmika Mandanna) రాత్రికి రాత్రే ముంబై నుండి హైదరాబాద్ చేరుకుంది. దాదాపు 20 రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉంటూ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేయడానికి మకాం మార్చేసింది.
వరుస ఫ్లాప్స్ నుండి బయటపడి ‘యానిమల్’ తో హిట్ ట్రాక్ ఎక్కిన రష్మిక
పుష్ప సినిమా తరువాత రష్మికకు ఆశించినంత హిట్ లభించలేదు. తమిళంలో వారిసు, తెలుగులో వారసుడుగా వచ్చిన ప్రేక్షకులకు చేరువకాలేకపోయింది. ఆ తరువాత శర్వానంద్‌తో చేసిన ఆడాళ్లు మీకు జోహార్లు కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. మధ్యలో ఆమె చేసిన బాలీవుడ్ సినిమాలు సైతం బెడిసి కొట్టాయి. తాజాగా రణ్‌బీర్ కపూర్ సందీప్ వంగాతో కలిసి చేసిన యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనితో రష్మిక మందన్నా చాలా నెలలు తరువాత హిట్ ట్రాక్ ఎక్కింది.
Also Read : Aamir Khan: చెన్నై వరదల్లో చిక్కుకున్న అమీర్ ఖాన్… రక్షించిన రెస్క్యూ టీమ్స్