Rashmika Mandanna : అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన `పుష్ప 2′ గురువారం (డిసెంబర్ 05) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజు ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. కాగా పుష్ప 2 సినిమా షూటింగ్ దాదాపు మూడు సంవత్సరాల పాటు జరిగింది. ఇక రెండు సినిమాలకు కలిపి మొత్తం ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ క్రమంలో ఇన్ని సంవత్సరాలుగా ‘పుష్ప’ సినిమా సెట్ తన ఇల్లు అని చెప్పిన రష్మిక మందన్న టీమ్ తో కలిసున్న మధుర క్షణాలను గుర్తుకు చేసుకుంది.
Rashmika Mandanna Shares
దర్శకుడు సుకుమార్, నటుడు అల్లు అర్జున్, కెమెరామెన్, ఇతర టీమ్ సభ్యులతో కలిసి వివిధ సందర్భాల్లో దిగన ఫొటోలను రష్మిక మందన్నా పంచుకుంది. సినిమా షూటింగ్ సమయంలో తీసిన చిత్రాలతో పాటు సినిమా ప్రమోషన్ సమయంలో తీసిన చిత్రాలను కూడా రష్మిక మందన్న షేర్ చేసింది. కాగా పుష్ప 3` సినిమా కూడా రాబోతుందని తెలుస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ కూడా ఉంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read : Auto Ram Prasad : జబర్దస్త్ నటుడు ఆటో రాంప్రసాద్ద్ యాక్సిడెంట్