Rashmika Mandanna: తన క్రష్ ఎంటో బయట పెట్టిన రష్మిక

తన క్రష్ ఎంటో బయట పెట్టిన రష్మిక

Rashmika Mandanna: ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి, గీతగోవిందం, డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప సినిమాలతో నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన కన్నడ బ్యూటీ రష్మికా మందన్నా. పుష్ప సినిమా తరువాత బాలీవుడ్ ను ఆకర్షించి ఏకంగా రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమాలో ఛాన్స్ కొట్టింది రష్మిక(Rashmika Mandanna). యానిమల్‌ మూవీతో రీసెంట్‌గా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకుని ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. స్టార్ హీరోలతో సమానంగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ సంపాదించి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ దక్కించుకుంది.

Rashmika Mandanna Crush Viral

టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ తో బాలీవుడ్‌లోనూ తెగ బిజీగా మారిపోయిన రష్మిక అంటే పడి చచ్చే అభిమానులు ఎంతో మంది ఉంటారు. కాని రష్మిక క్రష్‌ ఎవరో ఎంటో ఎవరికీ తెలియదు. అయితే ఈ మధ్యే తన క్రష్‌ని బయటపెట్టింది రష్మిక. సాంప్రదాయ చీరకట్టు అంటే తనకెంతో ఇష్టమని, ఫ్యాన్స్‌ ఆ ఇష్టాన్ని మరింత పెంచేశారు అంటూ రీసెంట్‌గానే చెప్పుకొచ్చింది. సాంప్రదాయంగా కనిపిస్తూనే ఫ్యాషన్‌ ట్రెండ్‌ను సెట్‌ చేయడంలో తగ్గేదేలే అంటుంది. అంతేకాదు దుస్తుల్లో తాను స్ట్టన్నింగ్‌గా కంటే కంఫర్ట్‌గా ఉండటాన్నే ఇష్టపడతాను అంటోంది. అందుకే కంఫర్ట్‌గా ఉండే ఔట్‌ఫిట్సే నా ఫ్యాషన్‌ స్టయిల్‌ అంటూ రివీల్‌ చేసింది. అంతేకాదు ప్రముఖ డిజైనర్‌ అర్పితా మెహతా డిజైన్‌ చేసిన ఈ చీరలో తళుక్కున మెరిసింది ఈ కన్నడ బ్యూటీ.

Also Read : Adivi Sesh: శ్రుతిహాసన్ తో అడవి శేష్‌ పాన్ ఇండియా సినిమా

national crushRashmika Mandanna
Comments (0)
Add Comment