Rashmika Mandanna: ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పిన నేషనల్ క్రష్ రష్మిక !

ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పిన నేషనల్ క్రష్ రష్మిక !

Rashmika Mandanna: ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. మాస్‌ మూవీ మేకర్స్, దీరజ్‌ మోగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై విద్యా కొప్పినీది, ధీరజ్‌ మోగిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందిస్తున్నారు. విభిన్నమైన ప్రేమ కథతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో లేడీ ఓరియంటెడ్ గెటప్ లో రష్మిక కనిపించబోతుంది.

అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ను ఓ అభిమాని ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇవ్వమని కోరారు. దీనితో అభిమాని కామెంట్ పై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ… ‘‘ఈ సినిమా టీజర్‌ రష్మిక(Rashmika Mandanna) పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నాం. టీజర్‌ కోసం ఐదు భాషల్లో రష్మిక డబ్బింగ్‌ చెప్పారు. ఆమె మలయాళంలో డబ్బింగ్‌ చెప్పడం ఇదే మొదటిసారి’’ అని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. దీనిపై స్పందించిన అభిమానులు ‘రష్మిక డెడికేషన్‌ అంటే ఇది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ‘యానిమల్‌’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌ ‘పుష్ప: ది రూల్‌’లో నటిస్తున్నారు. సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమా ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది.

Rashmika Mandanna – చాలా కాలం తరువాత మెగాఫోన్ పట్టిన రాహుల్‌ రవీంద్రన్‌

అందాల రాక్షసి సినిమాతో నటుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన రాహుల్‌ రవీంద్రన్‌… ఆ తరువాత ప్రముఖ గాయని చిన్మయి ని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత డైరెక్టర్ గా మారి `చిలసౌ`, `మన్మథుడు 2` సినిమాలకు దర్శకత్వం వహించారు. `చిలసౌ` హిట్‌ అయి… జాతీయ అవార్డుని అందుకున్నప్పటికీ `మన్మథుడు 2` మాత్రం డిజాస్టర్‌ గా నిలిచిపోయింది. దీనితో దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌ తీసుకున్న రాహుల్‌ రవీంద్రన్‌… మరల `ది గర్ల్ ఫ్రెండ్‌` సినిమాతో వస్తున్నారు.

Also Read : Natural Star Nani: హిట్టు కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్న ‘నాని 33’ !

Rahul RavindranRashmika Mandannathe girl friend
Comments (0)
Add Comment