Rashmika Mandanna : కేరళ అభిమానుల ప్రేమకు నేను ఫిదా అయిపోయా..

ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘మీ (అభిమానులు) స్వాగతం చూసి నా మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది...

Rashmika Mandanna : డిసెంబరు 5న ‘పుష్ప 2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇప్పటికే బీహార్‌లోని పాట్నాలో జరిగిన ‘పుష్ప-2(Pushpa 2)’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుక ఇండియా మొత్తం హాట్‌టాపిక్‌గా నిలవగా.. చెన్నయ్‌లో జరిగిన వైల్డ్‌ ఫైర్‌ ఈవెంట్‌ నిజంగా వైల్డ్ రీచ్‌ని అందుకుంది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఎక్కడికి వెళితే అక్కడ అభిమానులు గ్రాండ్‌ వెల్‌కమ్ చెబుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో గ్రాండ్‌ ఈవెంట్‌‌ను కేరళలోని కొచ్చిలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కేరళ అభిమానుల ప్రేమకు ఫిదా అయినట్లుగా చెప్పుకొచ్చింది రష్మికా మందన్నా.

Rashmika Mandanna Comment

ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘మీ (అభిమానులు) స్వాగతం చూసి నా మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. మీ ప్రేమకు ఫిదా అయిపోయాను. అల్లు అర్జున్‌ మీద మీ ప్రేమ వెలకట్టలేనిది. అల్లు అర్జున్‌ నా జీవితంలో ఎప్పుడూ ఒక స్పెషల్‌ పర్సన్‌. మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏంటంటే.. ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని ఒక్కరు కాదు సినిమా చూసిన అందరూ ఎంజాయ్‌ చేస్తారు. నాకు కుదిరితే కొచ్చి వచ్చి మీతో (ప్రేక్షకులు) కలిసి సినిమా చూస్తాను. కేరళతో నా అనుబంధం చాలా గొప్పది. మీరంటే నాకు ఎంతో ప్రేమ అని అన్నారు. అంతేకాదు, కేరళ అభిమానుల కోసం రష్మిక(Rashmika Mandanna) ఈ వేదికపై సామీ సామీ సాంగ్‌కు డ్యాన్స్‌ కూడా చేశారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. కేరళలో అల్లు అర్జున్‌ క్రేజ్‌ చూశాం. ఇది హైదరాబాద్‌లా అనిపిస్తుంది. ఫహాద్‌ ఫాజిల్‌ ఈ సినిమాలో అద్భుతమైన పాత్రను చేశారు. ఈ సినిమా మా అందరికీ చాలా స్పెషల్‌. ‘పుష్ప-2’ రీచ్‌ కంటెంట్‌. మీ అందరికి సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నామని అన్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలు. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

Also Read : Vijay Deverakonda : రౌడీ బాయ్ ‘విడి 12’ సినిమాలో ఆ ఇద్దరు పవర్ ఫుల్ నటులు కూడానా..

CommentsRashmika MandannaTrendingUpdatesViral
Comments (0)
Add Comment